అల్లు అరవింద్‌ భయపడ్డట్టే అయింది

అల్లు అరవింద్‌ భయపడ్డట్టే అయింది

ఆర్య తర్వాత మళ్లీ కొత్త దర్శకుడితో పని చేయడానికి సాహసించని అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య'కి మాత్రం వక్కంతం వంశీని బలంగా, బ్లయిండ్‌గా నమ్మేసాడు. రచయితగా అనుభవం వున్నా కానీ ఫీల్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ లేని వక్కంతం వంశీ అసలు ఎలా డైరెక్ట్‌ చేస్తాడనేది తెలుసుకోవడానికి టెన్ట్‌ వీడియోలు తీయించమని అల్లు అరవింద్‌ సలహా ఇచ్చారట.

అయినప్పటికీ వంశీపై తనకి కాన్ఫిడెన్స్‌ వుందని, అలాంటివి ఏమీ అవసరం లేదని అతనిపై పూర్తి బాధ్యత పెట్టేసాడు. తీరా సినిమా చూస్తే అల్లు అరవింద్‌ భయపడ్డట్టుగానే అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. స్టయిలిష్‌ ఫ్రేమింగ్స్‌ పెట్టినా కానీ ఒక టెంపో మెయింటైన్‌ చేయడంలో వంశీ ఫెయిలయ్యాడు. ఎంతసేపు హీరో పాత్ర మీద ఫోకస్‌ వుంచి మిగిలిన విషయాలన్నీ పక్కన పడేసాడు. దీంతో హీరో పాత్ర మినహా ఏ ఎమోషన్‌ సరిగా పండలేదు.

తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్‌ని, తల్లీ కొడుకు, భార్యాభర్తల మధ్య ఎమోషన్స్‌ని కూడా పట్టించుకోకుండా కేవలం హీరోని ఎలివేట్‌ చేయడం మీదే దృష్టి పెట్టడంతో వన్‌ డైమెన్షనల్‌ సినిమాగా  తయారై విమర్శల పాలవుతోంది. క్యారెక్టర్‌ మాయలో పడిపోయిన అల్లు అర్జున్‌ కూడా మిగతా లోపాలు, లోటులు చూసుకోకుండా కేవలం పర్‌ఫార్మెన్స్‌కి వచ్చిన ప్రశంసలతో సరిపెట్టుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు