ఇలాగైతే కష్టం తల్లీ..

ఇలాగైతే కష్టం తల్లీ..

‘మజ్ను’ లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయెల్. ఆ తర్వాత ఆమె చేసిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ కూడా చిన్న సినిమానే. ఇలాంటి చిత్రాల్లో నటించిన అమ్మాయికి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సరసన ఆఫర్లు రావడం పెద్ద విషయమే. కానీ ఈ అశకాశాలు వచ్చాయన్న మాటే కానీ.. అవి అను కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడతాయన్నదే సందేహంగా మారింది.

పవన్ సరసన ఆమె చేసిన ‘అజ్ఞాతవాసి’ ఎంత పెద్ద డిజాస్టరైందో తెలిసిందే. ఆ సినిమా వల్ల ఆమెకు పైసా ప్రయోజనం లేకపోయింది. అందులోని పాత్ర పేలవంగా కనిపించింది. ఆ చేదు జ్ఞాపకాల్ని ‘నా పేరు సూర్య’ చెరిపేస్తుందనుకుంటే.. అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ లేదు. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు.

ఐతే ‘అజ్ఞాతవాసి’ లాంటి ఫలితం ‘నా పేరు సూర్య’కు ఎదురు కాకపోవచ్చు. ఓ మోస్తరు ఫలితంతో ఈ చిత్రం సంతృప్తి చెందొచ్చు. ఐతే అనుకు ఈ సినిమా ద్వారా కలిగే ప్రయోజనం మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. ఈ చిత్రంలో అను ఎలాంటి ముద్ర వేయలేకపోయింది. బన్నీ సరసన కథానాయికగా కనిపించే స్థాయి ఆమెకు లేదనిపించింది సినిమా చూస్తుంటే. ఆమె లుక్స్ ఏమంత ఆకర్షణీయంగా లేవు. ఇదే బన్నీ సరసన ‘డీజే’లో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే ఎలా వెలిగిపోయిందో తెలిసిందే. ఆ చిత్రానికి ఆమె గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కానీ ‘నా పేరు సూర్య’లో అను తెగ ఎక్స్‌పోజింగ్ చేసినా ఫలితం లేకపోయింది. దాదాపుగా ప్రతి సీన్లోనూ క్లీవేజ్ షో చేసింది అను. పూజ లాగా ఆమె గ్లామర్ ఎలివేట్ కాలేదు. పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకురాలేదు. ఇక అను పాత్ర గురించి.. నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. దాని గురించి డిస్కషనే లేదసలు. ప్రస్తుతం అను చేతిలో ఇంకో రెండు క్రేజీ ప్రాజెక్టులైతే ఉన్నాయి కానీ.. ఆమె ఎంతో కాలం నిలుస్తుందన్న ఆశలైతే కలగట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English