తెలుగు పిల్ల తెలుగు లో డబ్బింగ్ చెప్పింది

తెలుగు పిల్ల తెలుగు లో డబ్బింగ్ చెప్పింది

అదితి రావ్ హైదరి.. ఈ భామ గురించి ఇంటర్నెట్ లో వెతుక్కున్న వారికి.. ఈమె హైద్రాబాదీ అనే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అది చూసి అందరూ ఈమె ఇక్కడే పెరిగిందేమో అనుకుంటూ ఉంటారు. కానీ అదితి పుట్టింది ఇక్కడే అయినా.. పెరిగింది మాత్రం నార్త్ ఇండియాలోనే. తెలుగు మాటలు అర్ధం అవుతాయంతే. మాట్లాడడం అస్సలు రాదని చెబుతోంది అదితి రావ్ హైదరి.

తమ ఇంట్లో తెలుగు.. హిందీ కలగాపులగం చేసి మాట్లాడుకుంటూ ఉంటారని.. అలా తెలుగు తెలుసు తప్ప.. మాట్లాడ్డం మాత్రం రాదని అంటోంది ఈ భామ. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చిందంటే.. అదితి ఇప్పుడు సమ్మోహనం అంటూ ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీతో నేరుగా తెలుగు ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు అదితినే డబ్బింగ్ చెప్పమని సూచించాడట దర్శకుడు. క్యారెక్టర్ కు మరింతగా బలం చేకూరుతుందని ప్రోత్సహించాడట ఇంద్రగంటి. మొదట ఈ విషయంపై కాస్త సందేహించినా.. ఆ తర్వాత పాత్ర కోసం డబ్బింగ్ చెప్పేందుకే నిర్ణయించుకున్నానని అంటోంది.

తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో అదితి చెప్పిన తెలుగు మాటలే ఉన్నాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఇంట్లో కూడా తన తెలుగు మాటలు ఎలా ఉంటాయో చూద్దామనే ఆసక్తితో ఉన్నారని చెబుతోంది అదితి రావ్ హైదరి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో.. అదితి రావ్.. ఓ హీరోయిన్ పాత్రలోనే కనిపించనుండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు