అప్పుడు జగదేకవీరుడు.. ఇప్పుడు మహానటి

అప్పుడు జగదేకవీరుడు.. ఇప్పుడు మహానటి

మార్చి 29నే రావాల్సిన సినిమా ‘మహానటి’ పోయినేడాదే ఈ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఆ సమయానికి సినిమాను రెడీ చేయలేకోయారు. నెలన్నర ఆలస్యంగా మే 9న ఈ చిత్రం రిలీజవుతోంది. మామూలుగా కొత్త సినిమాలు శుక్రవారం రిలీజవుతుంటాయి. కానీ ఈ చిత్రాన్ని బుధవారమే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కారణమే ఉంది. మే 9నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న పట్టుదలతో అలా చేశారట. మార్చి 29న సినిమా విడుదల చేయలేమని ఫిక్సయ్యాక కొత్త డేట్ కోసం నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ చూస్తున్నపుడు వాళ్ల తండ్రి అశ్వినీదత్ మే 9న రిలీజ్ చేయమని సూచించాడట.

వైజయంతీ మూవీస్ బేనర్‌కే తలమానికంగా నిలిచి.. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మే9నే విడుదలైందట. ఆ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అప్పటికి ఉన్న కలెక్షన్ల రికార్డులన్నింటినీ అది తిరగరాసింది. అలాంటి సినిమా రిలీజైన రోజును సెంటిమెంటుగా భావించి మే 9న ‘మహానటి’ని రిలీజ్ చేయమనడంతో సరే అన్నారట ప్రియాంక, స్వప్న. తమ బేనర్లో ‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్‌ను ప్రియాంక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’కు చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు కానీ.. నాగ్ అశ్విన్ అశ్వినీదత్ అల్లుడయ్యాక అతను తీయాలనుకున్న కలల చిత్రం ‘మహానటి’ కోసం దత్ కుటుంబం చాలా భారీగానే ఖర్చు చేసింది. మరి వీళ్లందరూ పెట్టిన నమ్మకాన్ని అశ్విన్ ఏమేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు