బన్నీ స్లో అయితే వాళ్లకు పండగేగా

బన్నీ స్లో అయితే వాళ్లకు పండగేగా

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ అల్లు అర్జున్ సందడి చేసేస్తున్నాడు. థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. సీరియస్ థీమ్ మూవీ కావడంతో మిక్సెడ్ టాక్ వినిపిస్తున్నా.. నా పేరు సూర్య టీం చేసిన సిన్సియర్ ఎఫర్ట్ ను మాత్రం పలువురు ప్రశంసిస్తున్నారు. కమర్షియల్ హంగులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా సినిమా తీసిన తీరు ఆకట్టుకుంటోంది.

అయితే.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలను పరిశీలిస్తే.. రామ్ చరణ్ రంగస్థలం ఇంకా రచ్చ చేస్తుండడం.. ట్రేడ్ జనాలను కూడా విస్మయపరుస్తోంది. గత వారంలో కూడా 5 కోట్ల షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. మరోవైపు రెండు వారాల క్రితం వచ్చిన మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను ఇప్పటికే స్లో అయిపోయింది. ఆడియన్స్ ను రిపీటెడ్ గా థియేటర్లకు రప్పించే కంటెంట్ లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కనుక స్లో అయితే మాత్రం.. రంగస్థలం మినహా పోటీయే లేని పరిస్థితి కనిపిస్తుండడంతో.. రాబోయే సినిమాలు పండుగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నెల 9వ తేదీన మహానటి మూవీ రిలీజ్ అవుతుండగా.. 11వ తేదీన మెహబూబా చిత్రాలు వస్తున్నాయి. బన్నీ మూవీ జోరు చూపిస్తే.. ఈ చిత్రాలకు థియేటర్లు కూడా ఎక్కువగా దొరక్కపోవచ్చు. కానీ స్టైలిష్ స్టార్ స్లో అయితే మాత్రం.. వీళ్లకు పండగే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు