మహేష్ 100 లోపే సరిపెట్టుకోవాలా?

మహేష్ 100 లోపే సరిపెట్టుకోవాలా?

మొత్తానికి చాన్నాళ్ల తర్వాత మహేష్ బాబు ముఖం మళ్లీ వెలిగిపోయింది. 30 నెలల విరామం తర్వాత మహేష్ సినిమాకు మళ్లీ పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ జనాలు అభమానులు పెట్టుకున్న స్థాయిలో కాకపోయినా ‘భరత్ అనే నేను’ మంచి వసూళ్లే రాబట్టింది. ఈ చిత్రం మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

‘శ్రీమంతుడు’ వసూళ్లను ఈ చిత్రం దాటేసింది. 2015లో విడుదలైన ‘శ్రీమంతుడు’ నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ రూ.85 కోట్ల షేర్ సాధించింది. ‘భరత్ అనే నేను’ రెండు వారాల్లో రూ.88 కోట్ల షేర్ తో ‘శ్రీమంతుడు’ను దాటి ఆల్ టైం టాలీవుడ్ టాప్-5 చిత్రాల్లో ఐదో స్థానానికి చేరుకుంది.

‘బాహుబలి: ది కంక్లూజన్’.. ‘బాహుబలి: ది బిగినింగ్’ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ‘రంగస్థలం’ ఇటీవలే టాప్-3కి చేరింది. ఆ చిత్రం ప్రస్తుతం రూ.115 కోట్ల షేర్‌ మార్కు దగ్గర ఉంది. ‘ఖైదీ నంబర్ 150’ రూ.105 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ‘భరత్ అనే నేను’ చిరు సినిమా వసూళ్లను దాటడం కూడా కష్టంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకోవడమూ కష్టంగానే కనిపిస్తోంది. ఈ చిత్రం రెండు వారాల్లోపే ఏం చేసినా చేయాల్సింది.

శుక్రవారం ‘నా పేరు సూర్య’ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వీకెండ్ మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఐతే అల్లు అర్జున్ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే చెప్పలేం. అప్పుడు ఓ మోస్తరుగా షేర్ వస్తుంది. లేదంటే మాత్రం రూ.90 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు