ముచ్చటగా మూడోసారి.. కొట్టాల్సిందే

ముచ్చటగా మూడోసారి.. కొట్టాల్సిందే

మాస్ హీరో గోపీచంద్ ప్రస్తుతం టఫ్ టైమ్స్ ఎదుర్కొంటున్నాడు. కొన్ని సినిమాలు రిలీజ్ కు కూడా ఇబ్బందులు పడుతుండడమే కాదు.. అసలు విడుదలే ఆగిపోయే పరిస్థితి వచ్చిందంటే.. సిట్యుయేషన్ అర్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ఓ క్రేజీ ప్రాజెక్టును గోపీచంద్ దక్కించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది విభిన్నమైన చిత్రాలను అందిస్తున్న చంద్రశేఖర్ యేలేటితో.. గోపీచంద్ మూవీ ఓకే అయిందనే టాక్ ఇప్పడుు గుప్పుమంది. ఇక్కడే అందరు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజ్ తో చంద్రశేఖర్ యేలేటి మూవీ ఖాయం అయిందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే.. తేజు డేట్స్ కోసం చాలా సమయం వేచి చూసిన ఈ దర్శకుడు.. మెగా హీరో బిజీ షెడ్యూల్ కారణంగా.. తన సినిమా ఇప్పుడప్పుడే మొదలుకాదనే అభిప్రాయానికి వచ్చేశాడట.

ఇక తేజు కోసం వెయిట్ చేసేందుకు బదులుగా తన థ్రిల్లర్ కథకు సరిపడే మరో హీరోను ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యి.. గోపీచంద్ ను సంప్రదించాడని తెలుస్తోంది. రీసెంట్ గా నెరేషన్ విన్న గోపీచంద్.. పూర్తి స్క్రిప్ట్ తీసుకురావాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఖాయం అయితే మాత్రం.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. గతంలో ఒక్కడున్నాడు.. సాహసం అంటూ రెండు సినిమాలు చేశారు ఈ కాంబో. ఆ రెండూ బాగున్నాయిలే అనిపించుకున్నా.. కమర్షియల్ హిట్టవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రాజెక్టు పడితే మాత్రం.. హిట్టు కొట్టాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు