కొడుకుతో లిప్ కిస్ పెట్టించాడా?

కొడుకుతో లిప్ కిస్ పెట్టించాడా?

ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన మెహబూబా  చిత్రం గురించి ఇండస్ట్రీ ఆసక్తికరంగా మాట్లాడుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ లభించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.

పూరీ ఎలాంటి కంటెంట్ ను మెహబూబాలో చూపించబోతున్నాడన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. తన కొడుకు ఆకాష్ నే హీరోగా పెట్టి సినిమా తీయడంతో జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యన పూరీ జగన్నాధ్ తను తీస్తున్న సినిమాల్లో లిప్ కిస్ లు పెట్టించేందుకు కూడా వెనుకాడడం లేదు. గతేడాది వచ్చిన రోగ్ మూవీలో అయితే.. రొమాన్స్ ఓ రేంజ్ లో పంచేశారు. ఇప్పుడు మెహబూబా మూవీలో కూడా లవ్ స్టోరీ కీలకంగా కనిపిస్తోంది. హీరో కేరక్టరైజేషన్ కు లవ్ స్టోరీని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

మరి తన కొడుకుతో హీరోయిన్ నేహాశెట్టికి లిప్ కిస్ పెట్టించి ఉంటాడా లేదా అన్నదే కీలకమైన పాయింట్. ప్రస్తుతం తన కొడుకును కుర్రాళ్లకు దగ్గర చేయడం.. పూరీ టార్గెట్ అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. కుర్రకారులో ఓ సారి కుదురుకుంటే.. హీరోగా సెటిల్ అయిపోయినట్లే. అలాంటప్పుడు.. ఈ తరం ట్రెండ్ కు అనుగుణంగా సినిమా తీసి ఉండడంలో ఆశ్చర్యం లేదు. బహుశా ఆ లిప్ కిస్ కారణంగానే ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చి ఉంటుందని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు