ఎవ్వరూ లేరు.. నాగార్జున పట్టేశాడా?

ఎవ్వరూ లేరు.. నాగార్జున పట్టేశాడా?

తన కొడుకుల్ని హీరోలుగా నిలబెట్టేవరకు అక్కినేని నాగార్జునకు నిద్ర పట్టేలా లేదు. ఆల్రెడీ నాగచైతన్యను ఒక స్థాయికి తీసుకెళ్లిపోయాడు. చైతూ గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదు. అతడి కోసం దర్శకులు.. నిర్మాతల నుంచి బాగానే పోటీ ఉంటోంది. చైతూ ఆరంభంలో బాగా స్ట్రగుల్ అయినప్పటికీ గత కొన్నేళ్లలో బాగానే నిలదొక్కుకున్నాడు.

తన సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకుని.. అన్నీ చూసుకునే స్థాయికి చేరాడు అతడికి సమంత అండ కూడా ఉందిప్పుడు. ఐతే అఖిల్ కెరీరే నాగార్జునకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అతడి రెండు సినిమాలూ చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ‘అఖిల్’ విషయంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని.. అన్నీ పక్కాగా సెట్ చేసినప్పటికీ ‘హలో’ ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయింది.

మూడో సినిమాకు ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరిని సెట్ చేశారు కానీ.. అతను అఖిల్ కు సక్సెస్ అయితే ఇవ్వగలడు కానీ.. అతడి రేంజ్ పెంచి, మార్కెట్ క్రియేట్ చేయగలడా అంటే మాత్రం సందేహమే. ఈ నేపథ్యంలో అఖిల్‌కు మంచి విజయాన్ని అందించి, ఇమేజ్ పెంచే దర్శకుడి వేటలో ఉన్నాడు నాగ్. ఆయన కళ్లు చాన్నాళ్లుగా కొరటాల శివ మీద ఉన్నాయి. కాకపోతే అతను దొరకలేదు. ఐతే ఇప్పుడు కొరటాల ‘భరత్ అనే నేను’ పని పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. స్టార్లందరికీ అతడితో పని చేయాలని ఉంది కానీ.. వెంటనే సినిమా కమిటయ్యే పరిస్థితి లేదు.
అల్లు అర్జున్-కొరటాల కాంబినేషన్ గురించి చర్చ జరిగింది కానీ.. కథ మలుపు తిరిగి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయడానికి బన్నీ రెడీ అయిపోయాడని అంటున్నారు. కొరటాల నానితో చేసే ప్రతిపాదన కూడా ఉన్నప్పటికీ.. నాగ్ అడ్డం పడి అఖిల్ కోసం చేయాల్సిందే అని ఆయన్ని కమిట్ చేయించినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు