ఆ సినిమా అద్భుతం అంటున్నారు..

ఆ సినిమా అద్భుతం అంటున్నారు..

కొన్ని సినిమాల టీజర్లు.. ట్రైలర్లు చూస్తేనే అవి చాలా గొప్పగా ఉంటాయన్న భావన కలుగుతుంది. ముందే ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది. అమితాబ్ బచ్చన్ కొత్త సినిమా ‘102 నాటౌట్’ చూస్తే అలాంటి భావనే కలిగింది జనాలకు. 102 ఏళ్ల వయసున్న ఓ ముసలి వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రమిది. రిషికపూర్ ఇందులో ఆయన తనయుడిగా నటించారు. అంత వయసున్న అమితాబ్ చాలా చురుగ్గా ఉంటూ అల్లరి చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. కానీ చిన్నవాడైన రిషి కపూర్ అనేక సమస్యలతో జీవితాన్ని సాగిస్తుంటాడు.

ఇలాంటి వైరుధ్యాలున్న వ్యక్తుల మధ్య నడిచే కథ ఇది. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రం ఫలితంపై చాలా ధీమాగా ఉన్న టీం.. ముందు రోజే బాలీవుడ్ సెలబ్రెటీలకు, మీడియా వాళ్లకు స్పెషల్ ప్రివ్యూ వేసింది. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇటు సెలబ్రెటీలు.. అటు మీడియా ప్రముఖులు ఈ చిత్రాన్ని తెగ పొగిడేస్తున్నారు. ఈ ఏడాది హిందీలో వచ్చిన బెస్ట్ మూవీ ఇదే అని కితాబిచ్చేస్తున్నారు. 3.5-4 రేటింగ్స్‌తో ఆల్రెడీ రివ్యూలు కూడా వచ్చేశాయి. అమితాబ్ బచ్చన్.. రిషి కపూర్ ఒకరితో ఒకరు పోటీ పడి అద్భుతంగా నటించారని అంటున్నారు. ఈ సినిమా చూసి బయటికి వచ్చేటపుడు కళ్లలో నీళ్లు.. గుండెలో సంతోషం నిండిపోయాయని.. ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా అని.. ప్రతి వ్యక్తీ తన తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమా చూడాలని అంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సి పన్ను.

ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఇలాగే పాజిటివ్‌గా స్పందించారీ చిత్రం గురించి. మరి సామాన్య ప్రేక్షకులు ఏమంటారో చూడాలి. ఇంతకుముందు ‘ఓ మై గాడ్’ సినిమాతో ప్రశంసలందుకున్న ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించిన చిత్రమిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు