భ‌ర‌త్ భామ‌కి అప్పుడే ఓపెనింగ్స్ కూడా

భ‌ర‌త్ భామ‌కి అప్పుడే ఓపెనింగ్స్ కూడా

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా మ‌హేష్ బాబుకి ఎంత క‌లిసొచ్చిందో తెలీదు కానీ హీరోయిన్ కైరా అద్వాణీకి మాత్రం బాగా క‌లిసొచ్చింది. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో కోటి రూపాయ‌ల హీరోయిన్ గా మారి రికార్డు సృష్టించిన కైరా... అప్పుడు షాప్ ఓపెనింగ్ ఆఫ‌ర్స్ కూడా ప‌ట్టేసింది. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కోసం తిరుప‌తిలో ప్ర‌త్యేక్ష‌మైందీ ముఖ్య‌మంత్రి గ‌ర్ల‌ఫ్రెండ్‌.

కైరా అద్వాణీని చూడ‌డానికి అభిమానులు పెద్ద సంఖ్య‌లోనే హాజ‌ర‌య్యారు. దాంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన ఈ ఉత్త‌రాది సుంద‌రాంగి... ఓ సెల్ఫీ వీడియో తీసి త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ‘తిరుప‌తి ప్ర‌జ‌లు చూపించిన ప్రేమాభిమానాల‌కు థ్యాంక్యూ సో మ‌చ్... త్వ‌రలో మ‌ళ్లీ ఇక్క‌డికి వ‌స్తానేమో...’ అంటూ కామెంట్ పెట్టింది కైరా. ఒకే సినిమాతో షాప్ ఓపెనింగ్స్ ప‌ట్టేసిందంటే... తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తే కైరాని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అనుకుంటున్నారు సినీ జ‌నాలు. అంద‌రి హీరోయిన్ల‌లా షాప్ ఓపెనింగ్ అన‌గానే గ్లామర్ తెగ దట్టించేయకుండా.. కాస్త జాగ్రత్తపడిందీ సుందరి.

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కైరా అద్వాణీ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న అందంగా క‌నిపించినా... గ్లామ‌ర్ ఒలికించ‌లేక‌పోయిన కైరా- చెర్రీ సినిమాతో ఆ లోటు తీర్చుకోవాల‌నుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు