మెహబూబా.. టికెట్స్ తెగుతాయా?

మెహబూబా.. టికెట్స్ తెగుతాయా?

పూరీ జగన్నాధ్ చాలా పట్టుదలగా తీసిన మూవీ మెహబూబా. తన కొడుకు ఆకాష్ పూరీనే హీరోగా పెట్టి ఈ చిత్రాన్ని తీశాడు. దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి లోకి జారిపోయిన తర్వాత.. స్ట్రాంగ్ కంటెంట్ ను బేస్ చేసుకుని చేస్తున్న సినిమాగా మెహబూబాను చెప్పవచ్చు. ఈ నెల 11న మెహబూబాను రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు.

మరో వారం వ్యవధి మాత్రమే ఉండడంతో.. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు మెహబూబా టీం. ఈ సినిమా విషయంలో ముందు నుంచి ఛార్మీ అధీనంలో నడుస్తున్న పూరీ కనెట్స్ బాగా యాక్టివ్ గా ఉంది. ఇప్పుడు ప్రచారం విషయంలో కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎండా కాలంలో సినిమా పోస్టర్లతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్టే. అయితే.. పూరీ కనెక్ట్స్ టీం మాత్రం.. మొబైల్ బటర్ మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైద్రాబాద్ ఎండలకు అల్లాడుతున్న జనాలకు.. ఈ బటర్ మిల్క్ వ్యాన్ లు ఉచితంగా మజ్జిగ పంచుతాయట. కొన్ని వ్యాన్ లను ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ.. ఈ ప్రమోషన్ కం ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టారు మెహబూబా టీం.

మరి ఈ మజ్జిగ గ్లాసులు సినిమా టికెట్స్ రూపంలో ఎంత వరకూ తెగుతాయో అప్పుడే చెప్పలేం కానీ.. మెహబూబా కంటెంట్ విషయంలో ఇప్పటికే అందరికీ మంచి నమ్మకం ఏర్పడింది. దిల్ రాజు టేకోవర్ చేసిన తర్వాత ట్రేడ్ జనాల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువగానే ఉంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English