పాత అనుష్క ఇంకా బయటకురాలేదు

పాత అనుష్క ఇంకా బయటకురాలేదు

అనుష్క శెట్టి.. మన టాలీవుడ్ కి స్వీటీ. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్లీ కళ తీసుకొచ్చిన ప్రతిభావంతురాలు. అరుంధతి నుంచి అల్ట్రామోడర్న్ గాళ్ వరకూ అన్ని రకాల క్యారెక్టర్లు చేయగల దిట్ట. అంతటి ప్రతిభావంతురాలిని.. ఇక కమర్షియల్ హీరోయిన్ గా చూడడం కష్టమేమో అనిపించక మానదు.

సైజ్ జీరో అంటూ ఒక్క సినిమా కోసం బరువు పెరిగి.. తన కెరీర్ నే ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంది. ఆ సినిమా తర్వాత బరువు తగ్గేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అసలు సాధ్యమే కావడం లేదు. డైటింగులు.. వర్కవుట్లు.. యోగాలు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగానూ ప్రయత్నించింది అనుష్క. అదుగో అరుంధతి బరువు తగ్గింది.. ఇదుగో స్వీటీ సన్నబడింది అంటూ వార్తలే తప్ప వాస్తవంలో ఎక్కడా పిసరంత కూడా సైజ్ తగ్గలేకపోయింది అనుష్క. ప్రస్తుతం ఈ భామ కేదార్ నాథ్ లో ఉంది. దైవ దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత దిగిన కొన్ని ఫోటోలు నెట్ లో దర్శనం ఇచ్చేశాయి. ఇక తనను మళ్లీ చక్కనమ్మగా చేసే బాధ్యత ఆ దేవుడికే ఇచ్చేసిందేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాత అనుష్క బయటకురావాలంటే ఇంకా టైమ్ పట్టొచ్చు అంటున్నారు కొందరు.

అయితే.. అనుష్కకు ఆఫర్ల విషయంలో లోటేమీ లేదు. కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే.. ఈ భామకు ఇప్పుడు కమర్షియల్ మూవీస్ లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడం లేదు. సింగం3 అంటూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడీ భామను సీరియస్ కాన్సెప్టులకు తప్ప.. గ్లామర్ యాంగిల్ పాత్రలకు అడగం అసాధ్యం అయిపోయింది. అదే అనుష్క అభిమానులను బెంగ పెట్టుకునేలా చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English