ఒక్క ఫైటు కోసమే 90 కోట్లట..

ఒక్క ఫైటు కోసమే 90 కోట్లట..

టాలీవుడ్ అద్భుత సృష్టి ‘బాహుబ‌లి’ త‌ర్వాత ఆ రేంజ్ సినిమా చేయాల‌నే సంక‌ల్పంతో ‘సాహో’ సినిమా మొద‌లెట్టాడు యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్‌. ముందు సింపుల్ గా తిద్దామ‌నుకున్నా... బాహుబ‌లి త‌ర్వాత ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగిపోవ‌డంతో స్క్రిప్టులో మార్పులు చేసి... బాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ న‌టుల ప‌ట్టుకొచ్చి వీర లెవెల్లో తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు డైరెక్ట‌ర్ సుజిత్‌. దీంతో నిర్మాత‌ల‌కి త‌డిసి మోపెడ‌వుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా బ‌డ్జెట్ 300 కోట్లు కావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలుగులో అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఇదే. ‘బాహుబ‌లి’ సినిమా బడ్జెట్ ఎక్కువే అయిన‌ప్ప‌టికీ అది రెండు భాగాలుగా తెర‌కెక్కింది. దాంతో మోస్ట్ కాస్టీలెస్ట్ తెలుగు మూవీగా సాహో రికార్డు సృష్టించ‌బోతోంది. ప్ర‌స్తుతం ‘సాహో’ టీం దుబాయ్ లో క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. పర్మిష‌న్స్ రాక‌పోవ‌డంతో లేటుగా దుబాయ్ వెళ్లిన సాహో టీం ఇంకో 50 రోజుల పాటు అక్క‌డే ఉండ‌బోతోంది. మొద‌ట ఈ ఫైట్ సీక్వెన్స్ బ‌డ్జెట్ 30 కోట్లు అనుకున్నా. ఇప్పుడు అది 90 కోట్ల‌కు పైనే ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఒక్క ఫైట్ కోసం 90 కోట్లు వెచ్చిస్తున్నారంటే సాహో కోసం నిర్మాత‌లు ఏ స్థాయిలో ఖ‌ర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌ముఖ హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్ కెన్నీ బెట్స్ ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు స్టంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’- ‘ర‌ష్ హావ‌ర్ 3’- ‘ట్రాన్స్ ఫార్మ‌ర్స్‌’ వంటి ఎన్నో హాలీవుడ్ చిత్రాల‌కు యాక్ష‌న్ ద‌ర్శ‌క‌త్వం చేశాడీయ‌న‌. ‘సాహో’ సినిమా కోసం ఏకంగా 20 నిమిషాలు ఛేజింగ్ ఫైట్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది చిత్ర బృందం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు