భరత్-సూర్య.. ఎవరి వ్యూహం వారిదే

భరత్-సూర్య.. ఎవరి వ్యూహం వారిదే

రీసెంట్ గా మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను వచ్చింది. ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు నుంచి భారీగానే ప్రచారం నిర్వహించారు. ఆలస్యంగా స్టార్ట్ చేశారనే మాటలు మొదటగా వినిపించినా.. మహేష్ టీం చూపించిన జోరు చూసి అందరూ ఆ విషయాన్ని మరచిపోయారు. ఐఫోన్లు పంచడం.. మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. కలెక్షన్ రిపోర్టులు బైటకు రాకుండా జాగ్రత్త పడ్డం వంటి చాలానే టెక్నిక్స్ పాటిందారు.

రిలీజ్ తర్వాత మంచి టాక్ వచ్చి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నా సరే ప్రమోషన్ ఆపలేదు. వీక్ డేస్ లో సినిమా కొంచెం స్లో అవడంతో.. రెండో వారాంతంలో కూడా ప్రమోషన్స్ చేశారు. ఇలా మహేష్ మూవీకోసం భారీ ప్రచారం చేస్తుంటే.. రేపు థియేటర్లలోకి వస్తున్న అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లెక్క మరోలా ఉంది. రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసి భారీ హంగామా చేసినట్లుగా అనిపిస్తున్నా.. ప్రమోషన్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. సూర్య విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నారట.

ఒక సారి సినిమా థియేటర్లలోకి వచ్చి మంచి టాక్  వచ్చిన తర్వాత.. ప్రచారం ఎక్కువగా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకే రోజున విడుదల కోసం పోటీ పడిన భరత్ అనే నేను.. నా  పేరు సూర్య చిత్రాలు.. చివరకు వేరు వేరు డేట్స్ లో రావడమే కాకుండా.. విభిన్న ప్రచార వ్యూహాలతో జనాలను మెప్పించేందుకు ప్రయత్నిస్తుండడం గమనించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English