గాసిప్‌: వర్మకి నాగ్‌ అక్షింతలు

గాసిప్‌: వర్మకి నాగ్‌ అక్షింతలు

తనకో డీసెంట్‌ సినిమా చేసి పెడతాడనే నమ్మకంతో వర్మ ఇటీవల ఎలాంటి సినిమాలు తీస్తున్నాడని తెలిసినా కానీ నాగార్జున అతనికి 'ఆఫీసర్‌' చేసాడు. వచ్చిన అవకాశం మీద దృష్టి పెట్టకుండా వర్మ ఎన్ని పక్క చూపులు చూసాడనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ దగ్గర్నుంచి, శ్రీరెడ్డిని ఉసిగొల్పడం వరకు అన్నిట్లోను వర్మ వేళ్లు పెట్టాడు. ఈ క్రమంలో తన విలువ పూర్తిగా పోగొట్టుకుని కనీసం మీడియా కూడా తనని పట్టించుకోని పరిస్థితి తెచ్చుకున్నాడు.

ఆఫీసర్‌ మరో మూడు వారాల్లో విడుదలకి రెడీ అవుతోండగా దీనిపై మినిమమ్‌ బజ్‌ లేదు. ఇంతవరకు బిజినెస్‌ కూడా జరగలేదు. దీని పట్ల నాగార్జున కూడా గుస్సా అయ్యాడట. వర్మకి గట్టిగానే అక్షింతలు వేసాడట. దీంతో ఆఫీసర్‌కి రెండో టీజర్‌ని విడుదల చేస్తున్నారు. మొదటి టీజర్‌కి వచ్చిన దారుణమైన స్పందన తర్వాత రెండవ టీజర్‌ని ఎలా కట్‌ చేసారనేది చూడాలి. వర్మ సినిమాలన్నిటికీ కూడా యుఎస్‌పి మార్కెటింగే.

మార్కెటింగ్‌తోనే అతని సినిమాలకి కాస్తయినా వసూళ్లు వచ్చాయి. కానీ ఆఫీసర్‌కి అలాంటి కాంట్రవర్సీలు కూడా ఏమీ కలిసి రావడం లేదు. ప్రస్తుతం మోరల్‌గా బాగా దెబ్బతిని వున్న వర్మ ఎంత మేకపోతు గాంభీర్యం చూపించినా కానీ డిఫెన్స్‌లో వున్నాడనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఆఫీసర్‌ని అతను ఏ విధంగా ఆకర్షణీయంగా మలుస్తాడనేది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు