పవర్‌ చూపిస్తోన్న అల్లు అర్జున్‌

పవర్‌ చూపిస్తోన్న అల్లు అర్జున్‌

భారీ సినిమాలు చాలానే వచ్చేసాయి కనుక ఇక లేట్‌ ఎంట్రీగా వస్తోన్న 'నా పేరు సూర్య'పై ప్రేక్షకులకి వుండే ఆసక్తి పాళ్లు ఎంత అనేది చర్చనీయాంశమైంది. అయితే బాక్సాఫీస్‌ మిగిలిన ఏ యువ హీరో చూపించని నిలకడ చూపిస్తోన్న అల్లు అర్జున్‌ మరోసారి తన స్టార్‌ పవర్‌ చూపిస్తున్నాడు. ఈ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బ్రహ్మాండంగా వున్నాయి.

అవెంజర్స్‌, భరత్‌ అనే నేను, రంగస్థలం ఇంకా రన్‌ అవుతోన్న కారణంగా ఎక్కువ థియేటర్లు, షోలు దొరకకపోయినా కానీ మంచి ఓపెనింగ్‌ అయితే గ్యారెంటీ అని అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్‌ చెబుతోంది. లేట్‌గా ఓపెన్‌ చేసిన ఎర్లీ మార్నింగ్‌ షోస్‌ కూడా ఓపెన్‌ అయిన కాసేపటికే సోల్డ్‌ అవుట్‌ అయిపోతున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులకి ఎంత ఆసక్తి వుందనేది ఈ బుకింగ్స్‌ చాటి చెబుతున్నాయి. లోకల్‌గానే కాకుండా ఓవర్సీస్‌లో కూడా మంచి ఓపెనింగ్‌ ఖాయమని ట్రేడ్‌ చెబుతోంది.

ఈమధ్య కాలంలో రొటీన్‌కి భిన్నంగా వున్న సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఆ రకంగా చూస్తే ఇది అల్లు అర్జున్‌కి ఖచ్చితంగా కొత్త రకం సినిమానే. రంగస్థలం చరణ్‌కి, భరత్‌ అనే నేను మహేష్‌కి వెరైటీ అయినట్టు ఇది కూడా అల్లు అర్జున్‌కి వెరైటీ ప్రాజెక్ట్‌ అవుతుందనే అనిపిస్తోంది. ఏ భారీ సినిమాకి అయినా ఇనీషియల్‌ పుల్‌ చాలా అవసరం కనుక దానిని సాధించిన సూర్య ఇక డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంటే సక్సెస్‌ అయిపోవడం సులువైన పని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు