శ్రీరెడ్డి మేటర్‌లో రుణం తీర్చేసుకుంటున్నాడు!

శ్రీరెడ్డి మేటర్‌లో రుణం తీర్చేసుకుంటున్నాడు!

శ్రీరెడ్డి ముందుగా సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ని టార్గెట్‌ చేసి మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. చాలా మందిపై అభియోగాలు చేసినా కానీ తన వద్ద వాట్సాప్‌ చాట్‌ల మినహా ఫోటో ఎవిడెన్సులు వున్నది మాత్రం అభిరామ్‌వి మాత్రమే. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు తేజ ఆమెతో మధ్యవర్తిత్వం చేసి అభిరామ్‌ని టార్గెట్‌ చేయకుండా చూసుకోవడానికి ట్రై చేసాడట. ఇందుకోసం తనకి రెండు సినిమాల్లో అవకాశాలు కూడా ఆఫర్‌ చేసాడట. ఈ సంగతి శ్రీరెడ్డి కూడా స్వయంగా చెప్పింది.

ఫోటోలు బయటకి రాకుండా ఆపలేకపోయినా కానీ ఆ ఫోటోలు బయటకి వచ్చిన తర్వాత అభిరామ్‌ విషయం సైడ్‌ ట్రాక్‌ చేయడంలో అయితే తేజ అండ్‌ కో సక్సెస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో తేజ చేసిన హెల్ప్‌కి సురేష్‌బాబు ఫిదా అయిపోయారట. సురేష్‌తో తేజకి మొదట్నుంచీ సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత వెంకటేష్‌తో అనుకున్న సినిమాకి భారీ డిమాండ్లు చేయడం, తర్వాత మంచి ఆఫర్‌ వచ్చిందని వెంకీ సినిమా పక్కనబెట్టి బాలకృష్ణతో 'ఎన్టీఆర్‌' తీయడానికి వెళ్లడంతో వారి మధ్య విబేధాలు వచ్చాయట.

కానీ శ్రీరెడ్డి మేటర్‌లో తేజ చొరవ వల్ల మళ్లీ ఇద్దరూ స్నేహితులయ్యారని, అందుకే ఎన్టీఆర్‌ సినిమా నుంచి బయటకి వచ్చిన తేజని పిలిచి మళ్లీ వెంకీతో సినిమా ట్రాక్‌ ఎక్కించమని చెప్పాడని, అలాగే తనకి మంచి పారితోషికం కూడా ఆఫర్‌ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు