ఎన్టీఆర్‌లా డిప్రెషన్‌కి గురవుతున్నాడా?

ఎన్టీఆర్‌లా డిప్రెషన్‌కి గురవుతున్నాడా?

సాయి ధరమ్‌ తేజ్‌ సినీ రంగ ప్రవేశం చేయకముందే ఫిజిక్‌ మీద బాగా శ్రద్ధ పెట్టాడు. మంచి బాడీ బిల్డర్‌ అయిన తేజ్‌ ఇటీవల షేప్‌ అవుట్‌ అయి కనిపిస్తున్నాడు. జవాన్‌, ఇంటిలిజెంట్‌ చిత్రాల్లోనే అతని ఫిజిక్‌ చాలా తేడాగా కనిపించింది. అప్పుడే అభిమానుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చినా కానీ సినిమాల మధ్య గ్యాప్‌ లేకపోవడం వల్ల టైమ్‌ దొరికినట్టు లేదు. 'తేజ్‌ ఐ లవ్‌ యు' చిత్రంలో తేజ్‌ మరింత లావుగా కనిపిస్తున్నాడు. టీజర్‌లో అయితే అతని ముఖంలోను ఆ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

వరుస పరాజయాల్లో డిప్రెషన్‌కి గురవడం అనేది ఎవరికైనా జరిగేదే. అప్పట్లో ఎన్టీఆర్‌ కూడా 'రాఖీ' టైమ్‌లో చాలా లావెక్కిపోయాడు. దానికి కారణం డిప్రెషన్‌ అని కూడా చెప్పాడు. అయితే లైపోసక్షన్‌ ద్వారా షేప్‌ కరక్ట్‌ చేసుకుని, అటు తర్వాత ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌తో స్లిమ్‌ బాడీ మెయింటైన్‌ చేస్తున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌కి ఇంకా లైపోసక్షన్‌లాంటివి అవసరం లేదు కానీ ఖచ్చితంగా జిమ్‌లో అయితే ఎక్కువ టైమ్‌ గడపాల్సిన టైమ్‌ వచ్చింది.

ఇదివరకు అయితే హీరోలు ఎంత లావున్నా పట్టించుకునే వారు కాదు కానీ ఇప్పుడు ట్రెండు మారింది. యువ హీరోలంతా మంచి ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తున్నారు కనుక తేజ్‌ దీనిని లైట్‌ తీసుకోవడానికి లేదు. ఇప్పటికే అతను షేపవుట్‌ అవుతున్నాడనే దానిపై మీడియాలో ఆర్టికల్స్‌ కనిపిస్తోన్న నేపథ్యంలో ఈపాటికే అలర్ట్‌ అయి వుంటాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు