అనుష్కా.. బచ్చన్ అనే నేను

అనుష్కా.. బచ్చన్ అనే నేను

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈ మే 1న తన 30వ పుట్టిన ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. భర్త విరాట్ ఐపీఎల్ లో చాలా రోజుల తరువాత తన టీమ్ ను గెలిపించి తనకు సంతోషాన్ని ఇచ్చాడు. అలాగే 31వ తేదీ సాయంత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ సినిమాకు తీసుకెళ్లి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక సోషల్ మీడియా ద్వారా స్పెషల్ పోస్ట్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే అనుష్క శర్మకు బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు స్నేహితులుగా ఉన్నారు. సీనియర్ హీరోలు కూడా ఆమెతో ఫ్రెండ్లిగా ఉంటారు. ముఖ్యంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే అనుష్కకు చాలా గౌరవం. అయితే అమితాబ్ అనుష్క బర్త్ డే కు మెస్సేజ్ పెట్టడంతో ఎలాంటి రిప్లై రాకపోవడంతో పెద్దాయన నిరాశ చెంది సోషల్ మీడియా ద్వారా ఓ ట్వీటేశారు. ''అనుష్క. నేను సీనియర్ అమితాబ్ బచ్చన్ ను. మే 1న ఎస్సెమ్మెస్ ద్వారా విషెష్ అందించాను. కానీ నో రెస్పాన్స్'' అని ట్వీట్ చేశారు.

ఇక మరో సగం ట్వీట్ లో రిప్లై ఇవ్వకపోవడానికి కారణం తెలిసింది అంటూ.. ఆమె నెంబర్ మార్చేసింది అని చెప్పారు. మరోసారి సోషల్ మీడియా ద్వారా మెస్సేజ్ చేయడంతో అనుష్క స్పందించింది. థ్యాంక్యూ యు సో మచ్ సర్.. నా బర్త్ డే ను గుర్తు పెట్టుకొని స్పెషల్ గా విషెస్ అందించినందుకు ఆనందంగా ఉందని చెబుతూ.. మీరు పంపిన మెస్సేజ్ కి బదులుగా ఇక్కడ నేను రెస్పాండ్ అవుతున్నాను అని అనుష్క ఆ ట్వీట్ లో తెలిపింది.

బాగుందమ్మా వీళ్ల ట్వీట్ల బాతాకానీ. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. బచ్చన్ సార సంస్కారం చూడండి.. ఆ హ్యూమర్ చూడండి.. మన స్టార్లలో చాలామందికి ఇది అర్జెంటుగా అవసరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు