రంగస్థలంని కొట్టడం కష్టమే!

రంగస్థలంని కొట్టడం కష్టమే!

యుఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికరమైన రేస్‌ జరుగుతోంది. శ్రీమంతుడు రికార్డుని తొలుత చేధించి మూడు మిలియన్ల క్లబ్‌లో చేరిన మొదటి నాన్‌ బాహుబలి సినిమాగా రంగస్థలం నిలిచింది. అక్కడితో ఆగకుండా మరో అర మిలియన్‌ కూడా సాధించి మరో మైలురాయిని కైవసం చేసుకుంది. మహేష్‌ పాపులారిటీ వల్ల, సినిమాకి వచ్చిన టాక్‌ వల్ల భరత్‌ అనే నేను సునాయాసంగానే మూడు మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. అయితే అక్కడ్నుంచి కష్టాలు మొదలయ్యాయి.

అవెంజర్స్‌ టేకోవర్‌ చేయడంతో భరత్‌ అనే నేను వసూళ్లు కుంటుపడ్డాయి. ప్రస్తుతానికి మూడు మిలియన్ల రెండు లక్షల ముప్పయ్‌ వేల డాలర్లు ఆర్జించిన భరత్‌ అనే నేను మరో రెండు లక్షల డెబ్బయ్‌ వేలకి పైగా డాలర్లు వసూలు చేస్తే రంగస్థలంని బీట్‌ చేస్తుంది. ఇప్పటికే కలక్షన్లు కుంటుపడగా, ఈవారంలో నా పేరు సూర్య రిలీజ్‌ అవుతోంది కనుక ఇక పెద్దగా వసూలయ్యే అవకాశాలు లేవు. మరీ క్లోజ్‌గా వచ్చి ఒక యాభై వేల డాలర్లు అలా లోటు పడితే తలా ఒక చేయి వేసి రికార్డు కొట్టిస్తారేమో కానీ లోటు అంతకుమించి పడే ఛాన్సులే ఎక్కువున్నాయి.

రంగస్థలంకి ఆల్‌మోస్ట్‌ డబుల్‌ లొకేషన్లలో రిలీజ్‌ అయిన భరత్‌ అనే నేనుకి మంచి టాక్‌తో కూడా అంత వసూళ్లు రాకపోవడం యుఎస్‌ కింగ్‌గా పేర్కొనే మహేష్‌కి ఒకింత లోటుగానే ఫాన్స్‌ ఫీలవుతున్నారు. ఏదేమైనా ఈ బాక్సాఫీస్‌ రేస్‌ ఇటీవలి కాలంలో అత్యంత ఉత్కంఠ రేకెత్తించి ఫాన్స్‌ని కీన్‌గా ఫాలో అయ్యేట్టు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు