హ్యాండిచ్చి ఆడియో ఫంక్షన్‌కొచ్చారు

హ్యాండిచ్చి ఆడియో ఫంక్షన్‌కొచ్చారు

మహానటి చిత్రానికి క్రేజ్‌ నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం గురించి ఆడియో వేడుకలో వక్తలు మాట్లాడిన దాంతో మరింత హైప్‌ వచ్చింది. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎన్టీఆర్‌, నాని ఇద్దరూ కూడా ఈ చిత్రంలో నటించాల్సిన వారే. విజయ్‌ దేవరకొండ చేసిన పాత్రని నానితో చేయించాలని చాలా ట్రై చేసారు.

ఎవడే సుబ్రమణ్యంతో నానికి కష్టకాలంలో బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు, నిర్మాణ సంస్థ కనుక అతను చేస్తాడనే వారు ఆశించారు కానీ నాని హ్యాండిచ్చాడు. దాంతో అతని స్థానంలో విజయ్‌ దేవరకొండని తీసుకున్నారు. విజయ్‌కి కూడా ఎవడే... చిత్రంతోనే గుర్తింపు రావడం గమనార్హం. అలాగే స్వప్న సినిమాని స్థాపించింది ఎన్టీఆర్‌ నటించిన స్టూడెంట్‌ నంబర్‌1 చిత్రంతో. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రని పోషిస్తాడని అతడిని చాలా ఇదిగా అడిగారు.

అయితే తాతగారి పాత్రని ససేమీరా చేయనంటూ ఎన్టీఆర్‌ నో చెప్పేసాడు. అయితే ఆడియో వేడుకకి లేదా ఏదైనా ప్రమోషన్‌ ఈవెంట్‌కి వస్తానని అప్పుడే మాట ఇచ్చిన ఎన్టీఆర్‌ దానిని నిలబెట్టుకున్నాడు. ఎన్టీఆర్‌ రావడం వల్ల ఈ ఆడియో వేడుకని మామూలుగా కంటే ఎక్కువ మంది వీక్షించారు. తద్వారా ఈ చిత్రానికి క్రేజ్‌ పెరగడానికి తారక్‌ ఓ కారణమయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు