గీతా ఆర్ట్స్‌ బంధించేసారు, హీరో ఎవరు?

గీతా ఆర్ట్స్‌ బంధించేసారు, హీరో ఎవరు?

ఈమధ్య ఏ దర్శకుడైనా ఒక కాంపౌండ్‌లో అడుగు పెడితే అక్కడే మరో చిత్రమైనా కమిట్‌ అవ్వాల్సి వస్తోంది. దిల్‌ రాజునుంచి నిర్మాతలు అందరూ దీనిని అలవర్చుకున్నారు. టాలెంట్‌ వున్న దర్శకులని ముందే మల్టిపుల్‌ సినిమాలకి కమిట్‌ చేయిస్తున్నారు. అలాగే రచయిత నుంచి దర్శకుడిగా ఎదిగిన వక్కంతం వంశీకి కూడా రెండవ సినిమాకి ముందే అగ్రిమెంట్‌ జరిగిపోయింది.

అతని మొదటి చిత్రమైన 'నా పేరు సూర్య'కి నిర్మాత అల్లు అరవింద్‌ కాకపోయినా గీతా ఆర్ట్స్‌ పర్యవేక్షణలోనే అన్నీ జరిగాయనేది తెలిసిన సంగతే. ఈ చిత్రానికి అల్లు అర్జున్‌ ఒప్పుకున్నప్పుడే గీతా ఆర్ట్స్‌లో వంశీ రెండవ చిత్రాన్ని కమిట్‌ చేయించారట. అయితే మరి వంశీ ఇప్పుడు మలి చిత్రానికి రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్‌ సంస్థ ఎవరిని హీరోగా తెస్తుంది? అల్లు అర్జున్‌ వెంటనే వంశీతో చేయడు కనుక మెగా కాంపౌండ్‌లో మిగిలిన పెద్ద స్టార్‌ రామ్‌ చరణ్‌.

అతను కూడా మరో రెండేళ్ల వరకు దొరకడు. ఈ ఇద్దరూ కాని పక్షంలో ఈ చిత్రం ఎవరితో చేస్తారు? హీరో దొరకక, నిర్మాతలకి కమిట్‌ అయి వున్న కారణం చేత ఖాళీగా వుండిపోయిన చాలా మంది దర్శకుల సరసన వంశీ కూడా చేరిపోతాడా, లేక మెగా కాంపౌండ్‌ ఆవలినుంచి ఎవరైనా హీరోని వెతికి తెస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు