ప‌వ‌న్ పై గ‌ల్లా షాకింగ్ ట్వీట్...డిలీట్!

ప‌వ‌న్ పై గ‌ల్లా షాకింగ్ ట్వీట్...డిలీట్!

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ల మధ్య ట్వీట్ వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.  ప్రశాంత్ కిషోర్ రచన - దర్శకత్వంలో జగన్-పవన్ ల సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోందని ప‌వ‌న్, జ‌గ‌న్ ల‌ను ఉద్దేశించి జ‌య‌దేవ్ షాకింగ్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత జ‌య‌దేవ్ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతా నుంచి వ‌చ్చిన రిప్లైకు జ‌య‌దేవ్ ఘాటుగా రిటార్ట్ ఇచ్చారు. గ‌డ‌చిన‌ నాలుగేళ్ల‌లో పార్ల‌మెంటులో 100 సార్లు ప్ర‌సంగించడాన్ని సెంచ‌రీ అంటార‌ని, ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై, ప్రధానిపై యుద్ధం చేస్తున్నామ‌ని గ‌ల్లా అన్నారు.

ప్రధానిని ప‌వ‌న్ ఎందుకు వెన‌కేసుకువ‌స్తున్నారని, పవ‌న్ ఎవ‌రితో పోరాడుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న బ్యాటరీలు ఎప్పుడూ ఫుల్ చార్జింగ్ తో ఉంటాయి. దె లాస్ట్ లాంగ్....రియ‌ల్లీ లాంగ్...అంటూ జ‌న‌సేన‌కు గ‌ల్లా ఇచ్చిన రిటార్టింగ్ ట్వీట్ వైరల్ అయింది. ప‌వ‌న్ క‌న్నా ఎక్కువ‌గా తాను న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరులో ఉన్నాన‌ని....గ‌ల్లా ట్వీట్ చేశారు. తాజాగా, మ‌రోసారి ప‌వ‌న్ పై గ‌ల్లా విరుచుకుప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని తిరుప‌తిలో ప్ర‌ధాని చెప్పిన‌పుడు ప‌క్క‌నే ఉన్న ప‌వ‌న్....ఇపుడెందుకు సైలెంట్ గా ఉన్నార‌ని గ‌ల్లా ప్ర‌శ్నించారు. అయితే, ప‌వ‌న్ పై చేసిన ట్వీట్ ను గ‌ల్లా కొద్ది సేప‌టికే డిలీట్ చేశారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని ప్ర‌ధాని అన‌లేద‌ని, ప్రధాని ప్రసంగాలను మార్ఫింగ్ చేశారని వ‌స్తున్న ఆరోపణలపై గల్లా త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ సంద‌ర్భంగా పవన్ కల్యాణ్ కు గ‌ల్లా కొన్ని ఘాటు ప్ర‌శ్నలు సంధించారు. ప‌వ‌న్ ను ఇర‌కాటంలో పెట్టేలా ట్వీట్ చేశారు."పవన్ కల్యాణ్ గారూ... మీరు కూడా ఈ మీటింగుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యం. మీరు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించడానికి ఇది సరిపోదా? ఆయన తన హామీలపై వెనక్కు తగ్గలేదా? మీరు కూడా అందుకు సాక్షే. ఈ వీడియోలను కూడా మార్ఫింగ్ చేశారా?" అని గ‌ల్లా సూటిగా ప్రశ్నించారు.

అయితే, ఏమ‌యిందో తెలియ‌దుగానీ...ఆ ట్వీట్ చేసిన కొద్ది సేప‌టికే దానిని గ‌ల్లా త‌న ఖాతా నుంచి తొల‌గించారు. 2014 ఏప్రిల్ 30న‌ తిరుపతిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో అప్ప‌టి ప్రధాని అభ్య‌ర్థి మోదీ ప్రసంగిస్తున్న వేళ, ఆయనకు సమీపంలో తన తల్లి గల్లా అరుణ కుమారి కూడా కూర్చుని ఉన్నారని, అన్ని మీడియా చానళ్ల వద్దా మోదీ ప్రసంగం ఫుటేజ్ లు ఉన్నాయని...కావాలంటే చెక్ చేసుకోవాల‌ని గ‌ల్లా మ‌రో ట్వీట్ చేశారు. ఇక‌నైనా ఫాసిస్టు కుతంత్రాల‌ను మోదీ ప్ర‌భుత్వం మానుకోవాల‌ని గ‌ల్లా అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు