బాత్ టబ్ లో రాజశేఖర్ కూతురు

బాత్ టబ్ లో రాజశేఖర్ కూతురు

ఈ తరం సుందరాంగులు ట్రెండ్ సెట్టర్స్ అయిపోతున్నారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన మడి కట్టుకు కూర్చోవాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ప్రూవ్ చేసేశారు. టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. టాలీవుడ్ లో అయితే.. ఇప్పుడిప్పుడే తమ వారసురాళ్లను కూడా సినిమాల్లోకి తెచ్చే ట్రెండ్ మొదలైంది కానీ.. వారికి బోలెడన్ని కండిషన్స్ అప్లై అవుతున్న మాట అంగీకరించాల్సిందే.

ఇక్కడ సీనియర్ల ఇగో సాటిస్ఫై అవుతుందేమో కానీ.. హీరోయిన్ గా తమ కెరీర్ ను సానబెట్టుకోవాలన్న ఈ తరం అమ్మాయిల కోరికలు మాత్రం నెరవేరడం లేదు. కానీ రాజశేఖర్ మాత్రం ఈ విషయంలో తన కూతురుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. తను గ్లామర్ హీరోయిన్ పాత్రలను ఏ మాత్రం మొహమాటం లేకుండా చేసేస్తానని ఇన్ డైరెక్టుగా చెబుతోంది శివాత్మిక.

స్విమ్మింగ్ పూల్ నుంచి పిక్స్ చాలానే చూసి ఉంటాం. కానీ శివాత్మిక మాత్రం బాత్ టబ్ లో కూర్చుని అందాల పోజులు ఇచ్చేసింది. తెల్లని బాత్ టబ్ లో.. నల్లని చీర కట్టుకుని.. స్కిన్ కలర్ కు దగ్గరగా ఉన్న స్లీవ్ లెస్ జాకెట్ తో మెరిసిపోతోంది శివాత్మిక. సెల్ఫ్ లవ్ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా బాగుంది. ఫ్యూచర్ లో తాను టాప్ హీరోయిన్ కంటెంస్టెంట్ చెప్పకనే చెబుతోంది శివాత్మిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు