ఎన్టీఆర్ ఆ నటుడిని పక్కన కూర్చోబెట్టుకుని..

ఎన్టీఆర్ ఆ నటుడిని పక్కన కూర్చోబెట్టుకుని..

‘రంగస్థలం’ సినిమాలో గుర్తుండి పోయే పాతరలు చాలానే ఉన్నాయి. అందులో జబర్దస్త్ మహేష్ పోషించిన క్యారెక్టర్ కూడా ఒకటి. ఎప్పుడూ హీరో వెన్నంటే ఉండే ఆ పాత్రలో మహేష్ అదరగొట్టేశాడు. అతడి సహజమైన నటన ప్రేక్షకుల మదిలో బలమైన ముద్రే వేసింది. మహేష్ నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. ఎందరో సెలబ్రెటీలు కూడా అతడి నటనను కొనియాడారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ ను తెగ పొగిడేశాడు.

అతడిని పక్కన కూర్చోబెట్టుకుని మరి ప్రశంసలు కురిపించాడు. నిన్న హైదరాబాద్ లో ‘మహానటి’ ఆడియో వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఓ పాత్ర చేసిన మహేష్.. ఎన్టీఆర్ దగ్గరికెళ్లి కింద కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేయగా.. అతడిని తన పక్కన కూర్చోబెట్టి ‘రంగస్థలం’లో నటనకు సంబంధించి ప్రశంసించాడు తారక్.

ఈ అనుభవం గురించి మహేష్ సోషల్ మీడియాలో చాలా ఆనందంగా పంచుకున్నాడు. ‘‘బ్రదర్ మీరు షేక్ చేశారు. అదిరిపోయింది. చాలా ఎమోషన్ అయ్యాను మీ సీన్ చూసినపుడు. మనం కలుద్దాం’’ ఇవీ తనతో ఎన్టీఆర్ అన్న గోల్డెన్ వర్డ్స్ అని మహేష్ వెల్లడించాడు. ‘‘నేను కింద కూర్చుని అన్నతో మాట్లాడుతుంటే పైన కూర్చోండి బ్రదర్ అన్నారు. పైన కూర్చుంటే కానీ ఊరుకోలేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఆయన ఎంత గొప్పవాడు ఎందుకయ్యారో అని. లవ్ యూ సో మచ్ ఎన్టీఆర్ అన్న. మహానటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీలవుతున్నానో మహానటుడితో మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతున్నాను. థ్యాంక్యూ సో మచ్’’ అని అతను మెసేజ్ పెట్టాడు. ‘మహానటి’లో మహేష్ రమణారెడ్డి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను అరడజను సినిమాలతో చాలా బిజీగా ఉండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English