ఆ సెటైర్ కు దుల్కర్ రిప్లయ్ అదిరే

ఆ సెటైర్ కు దుల్కర్ రిప్లయ్ అదిరే

ఓ ఫిలిం ఈవెంట్ కు హాజరైన యాంకర్ అంటే.. కొన్ని గంటల పాటు ఆడియన్స్ ను ఎంకరేజ్ చేయాలి కాబట్టి.. కచ్చితంగా బోలెడంత కామెడీ చేయాల్సిందే. ఇందుకోసం స్పాంటేనియస్ గా బిహేవ్ చేయాల్సిందే. కానీ ఇలా ఓ తెలుగు సినిమా కోసం చేస్తున్న ఈవెంట్లో.. హోస్ట్ చేసే కామెంట్లు తెలుగు ఇండస్ట్రీని.. తెలుగు ప్రేక్షకులను తక్కువ అంచనా వేసేలా ఉండడం మాత్రం సమర్ధనీయం కాదు.

నిన్న జరిగిన మహానటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఇలాంటి సందర్భం ఎదురైంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యాంకర్ ఝాన్సీ. సీనియర్ మోస్ట్ కావడంతో.. బాగానే రక్తి కట్టించింది. అయితే.. దుల్కర్ సల్మాన్ స్టేజ్ మీదకు వచ్చినపుడు.. ఆడియన్స్ నుంచి కేరింతలు వినిపించాయి. 'తెలుగోళ్లు ఎప్పటి నుంచి మలయాళం సినిమాలు చూడ్డం మొదలుపెట్టారో. దుల్కర్ కు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా' అంటూ కామెంట్ చేసింది ఝాన్సీ. దీన్ని ఆ మలయాళీ హీరో నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

'తెలుగు ప్రేక్షకులు మలయాళంలో బెస్ట్ సినిమాలను గురించి గూగుల్ లో సెర్చ్ చేసి.. అలా నా సినిమాలను చూస్తున్నారు. నా గురించి తెలుసుకుని ప్రేమ కురిపిస్తున్నారు. సినిమాలను ఆదరించడంలో వీళ్ల తరువాతే ఎవరైనా. అన్ని బాషల సినిమాలూ చూస్తారు ఆంధ్ర ప్రజలు' అని చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్. అయినా.. ఓ మలయాళీ హీరోను పొగడ్డానికి మన మీద మనమే కామెడీ వేసుకోవడం టూ మచ్. పైగా దుల్కర్ మనకేమీ కొత్తోడు కాదు.. ఓకే బంగారం మూవీలో ఇతడిని మనం ఇంతకు ముందే చూశాం.. బాగానే ఆదరించాం కూడా. సీనియర్ యాంకర్ ఝాన్సీ ఈ విషయం ఎలా మర్చిపోయిందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English