కొనసాగుతోన్న మంచు కష్టాలు

కొనసాగుతోన్న మంచు కష్టాలు

మంచు ఫ్యామిలీ బాక్సాఫీస్‌ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. మోహన్‌బాబు నుంచి మనోజ్‌ వరకు ఎవరికీ ఈమధ్య ఏదీ కలిసి రావడం లేదు. గాయత్రి చిత్రానికి డీసెంట్‌గా వుందనే టాక్‌ వచ్చినా కానీ నామమాత్రపు ఓపెనింగ్‌ రాలేదు. మంచు మనోజ్‌ నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రమయితే విడుదలైన వారం లోపే కనుమరుగైంది. మంచు విష్ణుకి కూడా సోలోగా ఇటీవలి కాలంలో సక్సెస్సే లేదు. ఆచారి అమెరికా యాత్ర తొలి వారాంతం ముగియకముందే ఫెయిల్యూర్‌ అని తేలిపోయింది. మరోవైపు మంచు లక్ష్మికి కూడా కాలం కలిసి రావడం లేదు. మొత్తం ఫ్యామిలీ అంతా ప్రస్తుతం ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది.

మంచు మనోజ్‌, మంచు విష్ణు ఒక టైమ్‌లో కథల ఎంపికలో ప్రత్యేకత చాటుకునేవారు. ఎవరి స్టయిల్లో వారు ప్రేక్షకులని మెప్పించి డీసెంట్‌ సక్సెస్‌ అందుకోవడమే కాకుండా గ్యారెంటీ మార్కెట్‌ని కూడా ఏర్పరచుకున్నారు. అయితే రాంగోపాల్‌వర్మ ఎంట్రీ తర్వాత మంచు వారు ట్రాక్‌ తప్పారు. అంతకుముందు తమ సినిమాల్లో వుండే గ్రాండ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో పాటు స్క్రిప్ట్‌ వేల్యూ కూడా కనుమరుగవుతూ వచ్చింది. అసలే కొత్త కొత్త హీరోలు చాలా మంది పుట్టుకు వస్తోన్న టైమ్‌లో వరుస ఫ్లాప్‌లు ఎవరూ అఫార్డ్‌ చేయలేరు. ఈ సంధి కాలం నుంచి మంచు ఫ్యామిలీ ఏ విధంగా బయటపడుతుందో, మళ్లీ వారి ఇంట విజయానందం ఎప్పుడు తాండవిస్తుందో ఏమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు