మహేష్‌ ఊపుని నిలబెడతాడా?

మహేష్‌ ఊపుని నిలబెడతాడా?

కొరటాల శివ విషయంలో మహేష్‌ అంతగా ఎమోషనల్‌ అవుతున్నాడంటే దానికో రీజన్‌ వుంది. గత నాలుగేళ్లలో మహేష్‌ ఇచ్చిన రెండు హిట్‌ చిత్రాలకీ కొరటాల శివే దర్శకుడు. మిగతా దర్శకులపై మహేష్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయడమే కాదు... అతడిని కోలుకోలేని దెబ్బ తీసారు. ఆగడుతో శ్రీను వైట్ల, బ్రహ్మూెత్సవంతో అడ్డాల శ్రీకాంత్‌, స్పైడర్‌తో మురుగదాస్‌ ఇచ్చిన షాక్‌లు అలాంటిలాంటివి కావు. భరత్‌ అనే నేను కనుక మిస్‌ఫైర్‌ అయి వుంటే మహేష్‌ చాలా డిప్రెషన్‌కి గురయ్యేవాడు. మహేష్‌కి హిట్లు కొత్త కాదు కానీ, సక్సెస్‌ని నిలబెట్టుకోలేకపోవడం మాత్రం అతని వీక్‌నెస్సే. దర్శకులని గుడ్డిగా నమ్మేయడం తన బలం, బలహీనత కూడా. దర్శకులు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మహేష్‌ సినిమాలు అదరగొడతాయి. వాళ్లు కానీ కేర్‌లెస్‌గా వుంటే బయ్యర్లని ముంచేస్తాయి.

వరుసపెట్టి విజయాలను ఇవ్వడం మహేష్‌ కెరియర్‌లో ఎన్నడూ జరగలేదు. దూకుడు నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు మహేష్‌ కనబరిచిన ఊపు మినహాయిస్తే అతని కెరియర్లో గ్రాఫ్‌ అలా కొంతకాలం పైన మెయింటైన్‌ అయిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మహేష్‌ తదుపరి చిత్రంపై అభిమానులకి కాస్త గుబులు వుంది. మహేష్‌కి కూడా ఆ టెన్షన్‌ ఖచ్చితంగా వుంటుంది. మహేష్‌ మలి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఇతనికి భారీ హిట్లు లేవు కానీ నిలకడగా డీసెంట్‌ సినిమాలే అందిస్తున్నాడు. మహేష్‌కి కూడా అలాంటి డీసెంట్‌ సినిమా ఇస్తాడని ఫాన్స్‌ ఆశిస్తున్నారు. దిల్‌ రాజు హ్యాండ్‌ వుంది కనుక అదో భరోసా. మహేష్‌ ఇరవై అయిదవ చిత్రాన్ని వంశీ పైడిపల్లి అతడికి గుర్తుండిపోయే చిత్రంగా మలుస్తాడా లేదా అనేది వచ్చే వేసవికి తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు