అమల.. త్రిష.. ఇప్పుడు ఈ హీరోయిన్

అమల.. త్రిష.. ఇప్పుడు ఈ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ ఒక నటిగానే కాకుండా మానవత్వం కలిగిన స్త్రీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. వీలైనంత వరకు తన నుంచి సహాయాన్ని అందించడానికి అమ్మడు ఎప్పుడు ముందుంటుంది. అలాంటి మనసును చూసే విరాట్ కోహ్లీ ఆమెకు పడిపోయాడు. ఇకపోతే అనుష్క మంచి జంతు ప్రేమికురాలు. ముగా జీవులను చాలా ఇష్టపడుతుంది.

ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పటి నుంచో కలలు కంటున్న ఎనిమల్ షెల్టర్ పనులను మొదలు పెట్టించింది. ముంబై అవుట్ స్కర్ట్స్ ఓ ఆరు ఎకరాల ప్రశాంతమైన ప్రదేశంలో ముగా జంతువులకు ఆశ్రమం కల్పించనుంది. వృద్ధాప్య పెంపుడు జంతువులు అలాగే గాయపడిన మరియు ఒంటరి జీవులు ఆదుకోవటానికి మరియు జీవించడానికి తగినంత స్థలంలో సురక్షితమైన ఇంటిని ఏర్పరచాలని అనుష్క ఎప్పటి నుంచి కోరుకుంటోంది.  ఫైనల్ గా నేటితో ఆ కలకు రూపం మొదలవ్వబోతోంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే అనుష్క ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ మంచి కార్యక్రమం ద్వారా ఎన్నో ముగ జీవులకు ప్రశాంతంగా గడిపే అవకాశం దొరుకుతుంది.

ప్రస్తుతం అనుష్క చేస్తోన్న ఈ పనికి అభిమానుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.  మన తెలుగులో అమల ఇటువంటి వర్క్ ఎక్కువగా చేస్తుంది. అలాగే తమిళంలో త్రిష కూడా పెంపుడు జంతువుల కోసం చాలానే చేస్తుంది. వాళ్ల తరువాత జంతువులపై అంత ప్రేమను కురిపించే హీరోయిన్ గా ఇప్పుడు అనుష్క లైమ్ లైట్ లోకి వస్తోంది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు