విజయ్ దేవరకొండా మజాకా

విజయ్ దేవరకొండా మజాకా

‘అర్జున్ రెడ్డి’ తిరుగులేని ఇమేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ త్వరలోనే ‘ట్యాక్సీవాలా’గా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి టాప్ బేనర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆ బేనర్లపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గురి ఉంది. అలాంటి వాళ్లు ‘అర్జున్ రెడ్డి’ లాంటి అడల్ట్ మూవీ చేసిన విజయ్‌తో సినిమా చేయడం ఒకింత ఆశ్చర్యమే. ఆ బేనర్లకు.. విజయ్‌కి ఉన్న ఇమేజ్ వైరుధ్యం ప్రేక్షకుల్ని గందరగోళానికి గురి చేస్తుందేమో అన్న సందేహాలున్నాయి. విజయ్‌ను చూసి భయపడాల్సిన పని లేదని.. ‘ట్యాక్సీవాలా’లో అర్జున్ రెడ్డి ఛాయలేమీ ఉండవని.. విజయ్ పూర్తి భిన్నంగా.. పద్ధతిగానే కనిపిస్తాడని ప్రేక్షకులకు చాటిచెప్పాలని చిత్ర బృందం భావించినట్లుంది. ఇందుకోసం ఒక ప్రమోషనల్ వీడియో రూపొందించారు.

‘ది డ్రీమ్ బిహైండ్ ట్యాక్సీవాలా’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో చూస్తే ఈ చిత్ర బృందం తమ ఉద్దేశాన్ని ఎంత క్రియేటివ్‌గా చెప్పే ప్రయత్నం చేసిందో అర్థమవుతుంది. విజయ్ ఇంట్లో కూర్చుని ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూస్తుంటే నలుగురు పిల్లలొస్తారు. వాళ్లొచ్చి ‘అర్జున్ రెడ్డి’ అడల్ట్స్ మూవీ అని.. దాన్ని తాము చూడకూడదని చెప్పారని అంటారు. తర్వాత ఈసారి తామందరం చూసే సినిమా చేయాలని చెబుతూ.. అందుకోసం మార్పు మొదలుపెడతారు. ఇంట్లోని మందు బాటిళ్లు బయటపడేస్తారు. తర్వాత విజయ్‌కి గడ్డం గీస్తారు. విజయ్ దగ్గరున్న స్క్రిప్టులన్నీ తీసి చదివి అందులో పద్ధతిగా ఉన్న ఒక స్క్రిప్ట్ సెలక్ట్ చేస్తారు.బయటికొచ్చి బైక్ ఎక్కి సిగరెట్ ముట్టిస్తే నోటి నుంచి సిగార్ తీసి పడేస్తారు. తర్వాత బైక్ పక్కన పెట్టించి కారు ఎక్కిస్తారు. పిల్లలతో కలిసి రైడ్‌కు వెళ్లాక వాళ్లను దించేస్తూ థియేటర్లలో కలుద్దాం అంటాడు. ఇదీ ఈ కాన్సెప్ట్. ‘ట్యాక్సీవాలా’ అర్జున్ రెడ్డి టైపు కాదని.. ఇది కుటుంబ సమేతంగా.. పిల్లలందరూ కూడా కలిసి చూడదగ్గ సినిమా అని చాటిచెప్పే ప్రయత్నం ఇద్దన్నమాట. దీన్ని చాలా క్రియేటివ్ వేలో చెప్పి వావ్ అనిపించింది విజయ్ అండ్ టీం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు