‘తొలి ప్రేమ’ మ్యాజిక్ ఇన్నాళ్లకు కనిపించింది

‘తొలి ప్రేమ’ మ్యాజిక్ ఇన్నాళ్లకు కనిపించింది

తన తొలి సినిమా ‘తొలి ప్రేమ’తో తిరుగులేని పేరు సంపాదించాడు దర్శకుడు కరుణాకరన్. కానీ ఈ రెండు దశాబ్దాల్లో మళ్లీ ఆ స్థాయి సినిమా ఒక్కటీ తీయలేదు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’.. ‘డార్లింగ్’ మినహాయిస్తే అతడి కెరీర్లో వేరే హిట్లే లేవు. చివరగా అతను తీసిన ‘ఎందుకంటే ప్రేమంట’, ‘చిన్నదాన నీకోసం’ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇలాంటి టైంలో వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న సాయిధరమ్ తేజ్‌తో కరుణాకరన్ సినిమా అనగానే ఎవ్వరికీ పెద్దగా ఆసక్తి కలగలేదు. అందులోనూ ఈ మధ్యే వచ్చిన తేజ్ సినిమా ‘ఇంటిలిజెంట్’ పెద్ద డిజాస్టర్ కావడం దీనికి మరింత ప్రతికూలంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ల మీద కూడా ఆసక్తి లేకపోయింది.

ఐతే ఒక ఆహ్లాదకరమైన రొమాంటిక్ ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిత్ర బృందం.. ఇప్పుడు టీజర్‌తోనూ మెప్పించింది. ఇవాళే రిలీజైన ‘తేజ్ ఐ లవ్ యూ’ టీజర్ తాజాగా అనిపించింది. టీజింగ్‌గా, రొమాంటిగ్గా ఉన్న ఆ టీజర్.. ‘తొలి ప్రేమ’ కరుణాకరన్‌ను గుర్తు చేసింది. బ్యాగ్రౌండ్లో కనిపించిన ‘ఫ్రెష్ బ్రీజ్’ అనే మాట టీజర్లో కూడా కనిపించిందంటే అతిశయోక్తి లేదు. నేలవిడిచి సాము చేయకుండా సింపుల్‌గా టీజర్ కట్ చేశారు. తేజు గత సినిమాలకు దీనికి అసలు పోలికే లేదు. అతను క్యారెక్టర్ పరంగా ఒక మేకోవర్ ట్రై చేసినట్లున్నాడు. ఎప్పుడూ మాస్ అంశాలతో ఉంటాయి తేజు సినిమాల టీజర్లు. ఇందులో అలాంటిదేమీ లేకపోవడంతో కొత్తగా అనిపించింది. టీజర్ వరకైతే కరుణాకరన్-తేజు ఆశ్చర్యపరిచారు. ఆకట్టుకున్నారు. మరి సినిమా విషయంలో ఏం చేస్తారో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English