ఈ సోకుల చూపుల బిజినెస్ బాగుందిగా

ఈ సోకుల చూపుల బిజినెస్ బాగుందిగా

సినిమా హీరోయిన్లు.. గ్లామర్ వరల్డ్ మోడల్స్.. కొంతమంది బుల్లితెర సెన్సేషన్.. ఇలా చాలామంది అందాల అతివలు.. ఆన్ లైన్ లో హంగామా చేయడం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో ఈ బ్యూటీస్ ధారపోసే అందాలు ఓ రేంజ్ లో ఉంటాయి. స్టార్ సుందరాంగుల నుంచి అప్ కమింగ్ హీరోయిన్స్ వరకూ.. చాలామంది బ్యూటీలకు చెందిన గ్లామర్ పిక్స్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

నిజానికి వీటిలో అతి తక్కువ మాత్రమే నేరుగా ఆయా భామల టైమ్ లైన్స్ లో కనిపిస్తాయి. దాదాపుగా ఈ బికినీ షోకుల చిత్రాలు.. క్లీవేజ్ అందాల పిక్స్ అన్నీ వేరేవాళ్ల అకౌంట్స్ ద్వారా పబ్లిష్ అవుతుంటాయి. ఇక్కడే ఓ బిజినెస్ సీక్రెట్ ఉందట. నిజానికి ఈ ఫోటోల్లో చాలావరకు సెల్ఫీలను ఆయా సుందరాంగులే తీసుకుంటారు. కానీ వాటిని నేరుగా పోస్ట్ చేయకుండా.. సోషల్ మీడియాలో గ్లామర్ వరల్డ్ కు చెందిన కొన్ని కంపెనీలకు అమ్మేస్తుంటారు. ఇలాంటి ఫోటో ఒక్కోదానికి 20వేల రూపాయల వరకు ధర చెల్లిస్తారట.

ఈ ఫోటోల విషయంలో బల్క్ డీల్స్ మాట్లాడుకుని వారానికి ఇన్ని అనే లెక్కలో ఇస్తూ ఉంటారట బ్యూటీస్. అందుకే అందాల భామలు సెల్ఫీలు వారి ఖాతాల్లో కాకుండా..  వేరేవారి నుంచి పబ్లిష్ అవుతుంటాయి. ఆ  ఫోటోలను బేస్ చేసుకుని వారు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. ఇటు డబ్బులు.. మరోవైపు పబ్లిసిటీ.. అందుకే అందాల భామల సెల్ఫీల మార్కెట్ కు గిరాకీ ఎక్కువగానే ఉంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు