రామ్‌ చరణ్‌ నవ్వులో, నడకలో ఎంత మార్పు!

 రామ్‌ చరణ్‌ నవ్వులో, నడకలో ఎంత మార్పు!

సక్సెస్‌ ఇచ్చే కిక్‌ వేరేదీ ఇవ్వదని ఊరికే అనరు. ఒక్కసారి ఘన విజయాన్ని అందుకుంటే ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌నే చూడండి. గతంలో ఫోటోలకి ఫోజులివ్వాలన్నా, ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా చాలా బిడియపడే వాడు. ఏదో ఇన్‌సెక్యూరిటీ వున్నట్టుగా అతడి తీరు కనిపించేది. రంగస్థలంకి ముందు కూడా చరణ్‌కి విజయాలు వచ్చాయి కానీ ఎప్పుడూ అతడి స్థాయిని పెంచలేదవి. స్టార్‌గా విజయాలు అందుకున్నాడే కానీ యాక్టర్‌గా ఎన్నడూ చరణ్‌ పూర్తిస్థాయిలో మెప్పించలేదు. రంగస్థలం అదంతా మార్చేసింది. చరణ్‌కి ఒక బ్లాక్‌బస్టర్‌నే కాకుండా నటుడిగాను కీర్తి తెచ్చి పెట్టింది.

సక్సెస్‌ ఇచ్చే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌కి ప్రతిరూపంలా అతనిప్పుడు కనిపిస్తున్నాడు. కెమెరా కాన్షియస్‌ అనిపించిన వాడే ఇపుడు మనసారా నవ్వుతున్నాడు. నడకలో పూర్తి విశ్వాసం తొణికిసలాడుతోంది. తనచుట్టూ వుండే స్టార్‌ వైబ్‌కి తగ్గట్టు నడుచుకుంటున్నాడు. ఇంతకాలం మెగా అభిమానులకి సయితం 'చిరంజీవి కొడుకు'కి వుండాల్సిన ఠీవి, దర్పం చరణ్‌లో లేవనిపించేవి. వారిలో చాలా మంది అతనికి నటన సరిగా రాదని అభిప్రాయపడిన వారే. ఇప్పుడు అభిమానులు కూడా చరణ్‌ని పూర్తిగా ఓన్‌ చేసుకున్నారు.

చిరంజీవి ఇక హీరో పాత్రలకి దూరమయ్యే తరుణం దగ్గరవడంతో, పవన్‌ సినిమాలకి స్వస్తి చెప్పడంతో చరణ్‌లోనే వారు తదుపరి మెగాస్టార్‌ని, పవర్‌స్టార్‌ని చూసుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లకి పరిపూర్ణ నటుడు అనిపించుకున్న చరణ్‌ ప్రస్తుతం సినిమాల ఎంపికలోను చాలా పరిణితి చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో మెగాస్టార్‌ టైటిల్‌ని తన టాలెంట్‌తో గెలుచుకునే సత్తా వుందని అనిపించుకుంటున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు