చెర్రీకి అలాంటి టైటిల్.. కామెడీనే

చెర్రీకి అలాంటి టైటిల్.. కామెడీనే

రంగస్థలం మూవీతో రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ మాత్రమే కాదు.. నాన్ బాహుబలి మూవీ ఇండస్ట్రీ రికార్డు కూడా సాధించేశాడు. రీసెంట్ గా తమ చిత్రం 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు సినిమా(బాహుబలి మినహా) అంటూ పోస్టర్ కూడా వేశారు రంగస్థలం టీం.

ఇప్పుడు చెర్రీ మరుసటి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను హీరో లేకుండా పూర్తి చేసిన దర్శకుడు బోయపాటి.. ఇప్పుడు చరణ్ కూడా షూటింగ్ కు వచ్చేయడంతో.. చకచకా పనులు పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం బీహార్ తో పాటు హైద్రాబాద్ లోని కొన్ని ఏరియాల్లో షూటింగ్ ప్లాన్ చేసి.. అందుకు అనుగుణంగా షూట్ జరుగుతోంది. అయితే.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ సినిమాకు.. రాజ వంశస్థుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ కు ఇలాంటి టైటిల్ ఏంటా అని చాలామంది అనుకున్నారు.

అయితే.. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదనే సంగతి ఇఫ్పుడు తెలుస్తోంది. తమ సినిమాకు రాజవంశస్థుడు అనే టైటిల్ అస్సలు సూట్ కానే కాదని.. తాను ఈ పేరు విన్నపుడు నవ్వుకున్నానని చెబుతున్నాడు దర్శకుడు బోయపాటి. ఇంకా అసలు టైటిల్ సంగతి ఆలోచించలేదని.. కథకు అనుగుణంగా.. హీరో ఇమేజ్ కు తగినట్లుగానే సినిమా పేరు ఉంటుందని చెప్పిన బోయపాటి.. ఈ విషయంలో ప్రయోగాలు చేసే ప్రసక్తే లేదని చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు