అలాంటి చీప్ మెంటాలిటీ నాకు లేదు-కొరటాల

అలాంటి చీప్ మెంటాలిటీ నాకు లేదు-కొరటాల

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా అనగానే అందులో ఏదో ఒక వివాదం లేకుండా పోదు. గతంలో ఈ తరహా సినిమాలు వివాదం రేపాయి. కొన్ని పార్టీల వాళ్లను టార్గెట్ చేసి హీరోలు సెటైర్లు వేయడం మామూలే. ఐతే మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’లో అలాంటివేమీ కనిపించలేదు. మరి మీరెందుకు అలా ఆలోచించలేదు అని కొరటాలను అడిగితే.. ‘‘ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి హిట్ కొట్టాలనే చీప్ మెంటాలిటీ కాదు నాది. అందుకే ఎవరనే నొప్పించకుండా జనాల్ని మోటివేట్ చేసేలా ఈ సినిమా చేశాను’’ అని చెప్పాడు. ఈ సినిమా చేయడానికి ముందు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణను కలిసి ఇన్ పుట్స్ తీసుకున్నట్లు కొరటాల వెల్లడించాడు. ‘‘జయప్రకాష్ నారాయణగారిని కలిసి ఇలా సినిమా చేస్తున్నాను.. సొసైటీలో మార్పులు రావాలంటే ఏం చేయాలి అని అడిగి ఈ లోకల్ గవర్నెన్స్ లాంటి అంశాల గురించి ఆయనతో చర్చించాను’’ అన్నాడు.

ఈ సినిమాకు అందుకున్న కాంప్లిమెంట్ల గురించి చెబుతూ.. ‘‘జేపీ గారు సినిమాలు చూడటం చాలా తక్కువ. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారు. అది కూడ మర్చిపోలేని కాంప్లిమెంట్. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల వాళ్లు కూడా ఫోన్లు చేసి అభినందించారు. కేటీఆర్ గారు కూడా సినిమా చూశాక నాకు ఫోన్ చేసి సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఒక సామాజిక అంశాన్ని డీల్ చేసేప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా అది డాక్యుమెంటరీ అయిపోతుంది. కానీ మీరు మాత్రం కమర్షియల్ అంశాలని, సోషల్ పాయింట్ ను బాగా డీల్ చేశారు అన్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్’’ అన్నాడు కొరటాల. నిర్మాతగా మారాలన్న ఆలోచన గురించి కొరటాల స్పందిస్తూ.. ‘‘నేను చేయలేని కథలను నేనే స్వయంగా కొత్తవాళ్లతో నిర్మించాలని అనుకుంటున్నాను. అది ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు