టిక్కెట్లు కూడా దొరకట్లేదుగా..

టిక్కెట్లు కూడా దొరకట్లేదుగా..

ఆదివారం శ‌నివారం వ‌స్తే చాలు సినిమా థియేట‌ర్లు కిట‌కిట లాడేస్తున్నాయి. మార్చి 30న విడుద‌లైన రంగ‌స్థ‌లం ఏప్రిల్ 20న విడుద‌లైన భ‌ర‌త్ అను నేను  ఎవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాలు ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఆడుతున్నాయి. ఎవెంజ‌ర్స్ రాక‌ముందు వ‌ర‌కు భ‌ర‌త్‌కు టిక్కెట్లు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్‌. వీకెండ్లో భ‌ర‌త్‌కు రంగ‌స్థ‌లానికి టిక్కెట్లు కావాల్సిన‌న్నీ దొరుకుతున్నాయ్‌. కానీ ఎవెంజ‌ర్స్ హౌస్ ఫుల్ అయిపోతుంది.

మ‌న‌దేశంలో ఏప్రిల్ 27న విడుద‌లైంది ఎవెంజ‌ర్స్‌. తెలుగుతో పాటూ మొత్తం అయిదు భాష‌ల్లో దీనిని విడుద‌ల చేశారు. ఆ సినిమా విడుద‌లైన‌ప్పుడు రివ్యూలు మిశ్ర‌మంగా వ‌చ్చాయి. బావుంద‌ని ఒక‌రు రాస్తే ఊహించ‌నంత రేంజ్‌లో లేద‌ని మ‌రికొన్ని వెబ్‌సైట్లు రాశాయి. ఎవ‌రేం రాసినా ఎవెంజ‌ర్స్ క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని మాత్రం ఆప‌లేక‌పోతున్నాయ్‌. పిల్ల‌ల‌కు అలాంటి సూప‌ర్ హీరోల సినిమాలు బాగా న‌చ్చేస్తాయి క‌నుక  ఇంట్లో గోల చేసి మ‌రీ ఆ సినిమాకు తీసుకువెళ్ల‌మ‌ని అడుగుతున్నార‌ట‌. దీంతో ఆది శ‌ని వారాల్లో ఎవెంజ‌ర్స్‌కు టిక్కెట్లు దొర‌క‌డం లేదు. విడుద‌లైన వార‌మే మూడు రోజుల్లో అయిదు భాష‌ల్లో క‌లిపి 120 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింది ఎవెంజ‌ర్స్‌. వీక్ డేస్ లో టిక్కెట్లు దొరుకుతున్నా వీకెండ్లో మాత్రం ఎవెంజ‌ర్స్ థియేట‌ర్లు కిట‌కిట లాడేస్తున్నాయి. భ‌ర‌త్ అను నేనుకు ఎవెంజ‌ర్స్ దెబ్బ కొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎవెంజ‌ర్స్ థియేట‌ర్ల‌లోకి రాక‌పోతే నా పేరు సూర్య సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు భ‌ర‌త్ క‌లెక్ష‌న్లు అదిరిపోయేవి.

రెండు డ‌జ‌న్ల మంది సూప‌ర్ హీరోలు ఒకేఒక్క సూప‌ర్ విల‌న్‌... వారి చుట్టూ జ‌రిగే క‌థే ఎవెంజ‌ర్స్ ఇన్ఫ‌నిటీ వార్‌. ఒక్క సూప‌ర్ హీరో ఉంటేనే పిల్ల‌లు ఆ సినిమా చూసే వ‌ర‌కు వెర్రెక్కిపోతారు. అలాంటిది తాము మెచ్చే అంద‌రూ సూప‌ర్ హీరోలు ఉంటే చూడ‌కుండా ఉంటారా? అందుకే ఎవెంజ‌ర్స్ కు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు