పిక్ టాక్: చూపుల తిప్పుకోనివ్వని చెలియ

పిక్ టాక్: చూపుల తిప్పుకోనివ్వని చెలియ

హైద్రాబాదీ భామే అయినా ఇప్పటివరకూ నేరుగా ఒక్క టాలీవుడ్ లో కూడా సినిమాలో కూడా కనిపించలేదు అదితి రావు హైదరి. కానీ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఇప్పటికే తన సత్తా చాటేస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తెగ సెన్సేషన్ అవుతూ ఉంటుంది.

ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో ఈమెకు  స్పెషల్ గుర్తింపు ఉంది. అసలు టూ పీస్ బికినీల్లో గ్లామర్ ఒలకబోయడంలో అదితికి ఓ స్పెషల్ స్టైల్ కూడా ఉంది. ఎప్పటకప్పుడు బికినీలో అందాలను సూపర్బ్ గా చాటే అదితి రావ్ హైదరి.. ఈ సారి కొంచెం రూట్ మార్చింది. తాజాగా వోగ్ మేగజైన్ కు ఫోటోషూట్ చేసిన ఈ భామ.. కవర్ పేజ్ కోసం గ్లామర్ చిందులు చిందించినా.. బికినీ టాప్ ధరించింది. ట్రెడిషనల్ వేర్ మాదిరిగా ఉన్న డ్రెస్ కు కూడా బికినీ టాప్ తో ఈ వయ్యారి టచప్ ఇచ్చిన తీరు ప్రశంసించాల్సిందే. ఇక బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ మంచి స్పీడ్ మీదే ఉంది.

 ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అయిన పద్మావత్ చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించింది. మరోవైపు టాలీవుడ్ లో కూడా అరంగేట్రానికి సిద్ధం అయిపోయింది అదితి. గతంలో తమిళ్ మూవీ కాట్రు వెలియిదాయ్ తెలుగు వెర్షన్ చెలియా చిత్రంతో కనిపించిన అదితి రావు హైదరి.. ఈ సారి 'సమ్మోహనం' అంటూ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు