లావణ్య ఉచితంగా నటించింది

లావణ్య ఉచితంగా నటించింది

‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠికి కొంత కాలంగా కెరీర్ ఏమంత బాగా లేదు. వరుస డిజాస్టర్లతో ఆమె బాగా వెనుకబడిపోయింది. కొత్త ఏడాదిలో ‘ఇంటిలిజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ ఎదుర్కొంది లావణ్య. దీంతో ఆమె కెరీర్ అయోమయంలో పడింది. ప్రస్తుతం లావణ్య చేతిలో వరుణ్ తేజ్ సినిమా తప్ప మరేదీ లేదు. కొంత కాలంగా అసలు లావణ్య వార్తల్లోనే లేకుండా పోతోంది.

ఇలాంటి తరుణంలో ఒక ప్రకటన ద్వారా లావణ్య మళ్లీ సోషల్ మీడియాలో తళుక్కుమంది. ఐతే ఈ ప్రకటన కమర్షియల్ తరహాది కాదు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జనాల్లో చైతన్యం తెచ్చేందుకు రూపొందించింది. ఈ ప్రకటనలో లావణ్య ఉచితంగా నటించడం విశేషం.

రోడ్డు మీద వెళ్లేటపుడు ట్రాఫిక్ సిగ్నళ్లకు అనుగుణంగా నడుచుకోవడం ఎంత ముఖ్యమో చాటిచెప్పే ప్రకటన ఇది. లావణ్య ఒక రెస్టారెంట్లో ఉండగా.. ఆమెను కలవడానికి ఒక అమ్మాయి వస్తుంది. తనకు ఓ అబ్బాయి పరిచయం అయ్యాడని.. అతను డేట్ కోసం అడిగాడని.. నువ్వే అతడి విషయంలో ఏం చేయాలో చెప్పాలని అంటుంది. అయితే అతడి ఒరిజనల్ క్యారెక్టర్ ఎలాంటిదో టెస్టు పెడదామని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి కిందే కారుతో ఆగి ఉంటాడు. అతను రాత్రి పూట ట్రాఫిక్ లేదు కాబట్టి.. ముందున్న సిగ్నల్ దగ్గర ఆగుతాడా లేక ఎవరూ లేరు కదా అని ముందుకు వెళ్లిపోతాడా చూద్దాం.. దాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేద్దామంటుంది లావణ్య. ఆమె ఫ్రెండేమో మంచోడు.. ఆగుతాడు అంటుంది.

కానీ ఆ కుర్రాడు.. సిగ్నల్ దగ్గర ఆపి.. ఇటు అటు చూసి ట్రాఫిక్ వాళ్లెవరూ లేకపోవడంతో సిగ్నల్ జంప్ చేసి వెళ్లిపోతాడు. దీంతో డేట్ కట్ అంటుంది లావణ్య. గత కొంత కాలంగా సినీ తారల సహకారంతో ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించి జనాల్లో చైతన్య తేవడానికి హైదరాబాద్ పోలీసులు బాగానే కృషి చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు