క‌ల్యాణ్ కూడా లుక్ మార్చాడుగా

క‌ల్యాణ్ కూడా లుక్ మార్చాడుగా

హీరోగానే కాకుండా నిర్మాత‌గానూ మంచి పేరు సంపాదించుకున్నాడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. అనేక ప్ర‌యోగాలు కూడా చేశాడు. ఇప్పుడు త‌న జోన‌ర్‌కి ఏ మాత్రం సంబంధం లేని స‌బ్జెక్టున్న సినిమాలో న‌టిస్తున్నాడు. త‌మ‌న్నా జంట‌గా క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న ‘నా నువ్వే’ సినిమా ఓ కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌. అయితే ఇందులో మ‌నం ఊహించ‌లేని ట్వీస్టులెన్నో ఉంటాయ‌ట‌.

ఇప్ప‌టిదాకా విడుద‌ల‌యిన స్టిల్స్ పోస్ట‌ర్స్ లో మీసం తీసేసి సాప్ట్ లుక్ తో క‌నిపించాడు క‌ల్యాణ్ రామ్‌. కానీ ఈ మ‌ధ్యే విడుద‌ల‌యిన కొన్ని ఆన్ లొకేష‌న్ పిక్స్ చూస్తే మాత్రం షాక్ త‌గ‌ల‌డం ఖాయం. హెయిర్ స్టైల్ మార్చేసి గ‌డ్డం.. మీసంతో మాస్ లుక్ లో క‌నిపిస్తున్నాడు ఈ నంద‌మూరి హీరో. ఈ ఫోటోని బ‌ట్టి చూస్తే ఈ సినిమాలో మాస్ అంశాల‌కు కూడా కొద‌వ లేన‌ట్టుగా ఉంది. సాప్ట్ ల‌వ్ స్టోరీగా మొద‌లై ఇంట‌ర్వేల్ స‌మ‌యానికి ఊహించ‌ని ట్వీస్ట్ ల‌తో క‌థ ట‌ర్నింగ్ తీసుకుంటుంద‌ని స‌మాచారం. సిద్దార్థ్ హీరోగా ‘180’ వంటి డిఫ‌రెంట్ ప్రేమ‌క‌థ‌ను చూపించిన జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్‌... ఏరి కోరి ఈ నంద‌మూరి కుర్రాడితో సినిమా చేస్తున్నాడంటే స్టోరీలో ఏదో ఓ విశేషం ఉండే ఉంటుంది.

మే 25న విడుద‌ల కాబోతున్న ‘నా నువ్వే’ సినిమాపై అంచ‌నాలు పెంచే దిశగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని భావిస్తోంది చిత్ర బృందం. కాకపోతే తమన్నా గ్లామరసంతో కళ్యాణ్‌ రామ్ కొత్త లుక్స్ తో ఎంతవరకు క్రేజ్ సంపాదిస్తారనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు