చిన‌బాబు మ‌న‌సునూ దోచేశాడు చిట్టిబాబు

చిన‌బాబు మ‌న‌సునూ దోచేశాడు చిట్టిబాబు

భారీ అంచ‌నాల‌తో విడుద‌లై.. అంత‌కు మించిన సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకున్న చిత్రం రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంసించ‌టం తెలిసిందే. ఈ సినిమాను ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు చూసి.. ఫిదా కావ‌టం తెలిసిందే.

తాజాగా ఆ జాబితాలో చేరారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు.. ఏపీ ఐటీ మంత్రి నారాలోకేశ్. తాజాగా రంగ‌స్థ‌లం మూవీని చూసిన ఆయ‌న ట్విట్ట‌ర్లో స్పందించారు. తాను ఈ సినిమాను చూసిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. రంగ‌స్థ‌లం లాంటి అద్భుత‌మైన చిత్రాన్ని అందించినందుకురామ్ చ‌ర‌ణ్‌.. సుకుమార్‌ల‌కు ధ‌న్య‌వాదాల‌న్నారు. సినిమా చూసిన త‌ర్వాత కూడా చాలా పాత్ర‌లు వెంటాడుతున్నాయ‌ని.. అవి మ‌న‌తోనే ఉండిపోతాయ‌ని పొగిడేశారు.

గ్రేట్ వ‌ర్క్ గ‌య్స్ అంటూ పొగిడేసిన చిన‌బాబు పొగ‌డ్త‌కు.. రాంచ‌ర‌ణ్ రియాక్ట్ అయ్యారు. ఆ వెంట‌నే చిన‌బాబు వ్యాఖ్య‌కు స్పంద‌న‌గా థ్యాంక్యూ నారా లోకేశ్ గారూ అని కామెంట్ చేశారు. ఒక సూప‌ర్ హిట్ మూవీని.. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన మంచి సినిమాల్లో ఒక‌టైన మూవీని చూసేందుకు చిన‌బాబు ఇంత టైం తీసుకోవ‌టం ఏమిటో..?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు