బన్నీ ఇంతా చేసింది నాగబాబు కోసమా?

బన్నీ ఇంతా చేసింది నాగబాబు కోసమా?

అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’కు కుదిరిన నిర్మాత కాంబినేషన్ అందరికీ ఆశ్చర్యం కలిగింది. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తే.. నాగబాబు సమర్పించాడు. బన్నీ వాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇప్పటిదాకా శ్రీధర్ తీసినవి చిన్న సినిమాలే. పైగా ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. మరి అతడితో సినిమా చేశాడంటే.. ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడేమో అనుకుంటాం. కానీ అలాంటిదేమీ లేదట. బన్నీనే పిలిచి ఆయనకు సినిమా చేశాడట. ఇక ‘ఆరెంజ్’ తర్వాత సినీ నిర్మాణానికి పూర్తిగా దూరమైపోయిన నాగబాబు ఈ చిత్రానికి సమర్పకుడు కావడమూ ఆశ్చర్యమే. ఐతే అల్లు అర్జున్ ఏరి కోరి ఆయన్ని ఈ ప్రాజెక్టులో భాగస్వామి చేశాడట. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు చేసిందే నాగబాబు కోసమని సమాచారం.

అసలు ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించాల్సిందట. ఇంతకుముందు బన్నీతో ‘రేసు గుర్రం’ తీసిన నిర్మాత అతను. దాని తర్వాత వరుస ఫ్లాపులతో బాగా దెబ్బ తిన్నాడు. వక్కంతం కథ రెడీ చేసుకున్నాక దాన్ని బుజ్జినే బన్నీ దగ్గరికి తీసుకెళ్లాడట. బన్నీకి కథ నచ్చింది కానీ.. మీ ప్రొడక్షన్లో చేయలేనని.. తనకు కొన్ని ఆబ్లిగేషన్లు ఉన్నాయని.. సారీ అని చెప్పి ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నాడట. ‘ఆరెంజ్’ దెబ్బకు నాగబాబు బాగా చితికిపోయి ఏ స్థితికి చేరాడో తెలిసిందే. తర్వాత ‘జబర్దస్త్’ వల్ల.. కొన్ని టీవీ సీరియళ్లలో నటించడం ద్వారా.. కొడుకు వరుణ్ చేతికందడం ద్వారా ఈ మధ్యే కొంచెం కోలుకుని నిలబడ్డారు.

ఆయనకు ఓ సినిమా చేసి కొంచెం డబ్బులు తెచ్చిపెడదామన్న ఉద్దేశంతోనే బన్నీ ఈ సినిమా చేసినట్లు కనిపిస్తోంది. ఇక లగడపాటి శ్రీధర్ గురించి బన్నీ ప్రస్తావిస్తూ.. ‘స్టైల్’ దగ్గర్నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడని.. కానీ డబ్బులు పోగొట్టుకుంటున్నాడని.. అలాంటి మంచి నిర్మాతకు ఓ సినిమా చేద్దామనిపించి.. తనే ఫోన్ చేసి ఆయనకు ఈ సినిమా చేశానని బన్నీ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English