మంచు విష్ణు.. ఎందుకిలా?

మంచు విష్ణు.. ఎందుకిలా?

కొన్ని రోజుల కిందటే మంచు విష్ణు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాడు. సరైన ప్రమోషన్ లేక మంచి సినిమాలు కూడా అన్యాయమైపోతున్నాయని.. సినిమాను మార్కెట్ చేయడం ఒక కళ అని అతను అభిప్రాయపడ్డాడు. అతను ఏ సినిమా గురించి ఆ వ్యాఖ్యలు చేశాడో తెలియదు మరి. ఇప్పుడు విష్ణు కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలైంది. విడుదల ముంగిట ఈ చిత్రానికి కనీస బజ్ లేదు. ఈ సినిమా విడుదలవుతున్న సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. మార్కెటింగ్.. ప్రమోషన్ గురించి అలా కామెంట్ చేసిన విష్ణు ఈ చిత్ర ప్రమోషన్ జోలికే వెళ్లలేదు.

ట్విట్టర్లో రెండు మూడు మెసేజ్‌లు పెట్టడం.. వీడియోలు షేర్ చేయడం తప్ప మీడియాను కలిసి ఇంటర్వ్యూలివ్వడం.. టీవీ ఛానెళ్లకు వెళ్లడం లాంటివేమీ చేయలేదు. రిలీజ్ తర్వాత అసలు సోషల్ మీడియాలోనూ స్పందించడం మానేశాడు. సినిమా ఫలితమేంటో తెలిసిపోయి ముందు నుంచి విష్ణు ఇలా ఉండిపోయాడేమో తెలియదు. కానీ తనను నమ్మి ఒక నిర్మాత సినిమా తీసినపుడు తన వంతుగా సినిమాను ప్రమోట్ చేయడం అవసరం. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఈ విషయంలో మెరుగు. ఆమె కొంచెం మీడియాలో హడావుడి చేసింది. కానీ విష్ణు మాత్రం సైలెంటుగా ఉండిపోయాడు. నిజానికి ఈ సినిమా కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. సరైన సమయంలో.. సరైన ప్రమోషన్లతో రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ అలా జరగకపోవడంతో ఓపెనింగ్సే లేవు దీనికి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు