శ్రీ‌దేవిని శివ‌గామి కాకుండా ఆపింది అత‌నేన‌ట‌!

శ్రీ‌దేవిని శివ‌గామి కాకుండా ఆపింది అత‌నేన‌ట‌!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నోటి నుంచి ఎప్పుడు ఏ విష‌యం వ‌స్తుందో ఊహించ‌టం క‌ష్టం. ఆ మాట‌కు వ‌స్తే.. వ‌ర్మ కూడా ఆ విష‌యాన్ని క‌చ్ఛితంగా చెప్ప‌లేక‌పోవ‌చ్చు. ఓపెన్ నెస్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే వ‌ర్మ‌.. అడిగేవాడు అడ‌గాలే కానీ చెప్పేందుకు ఏ విష‌యం మీద‌నైనా రెఢీ అన్న‌ట్లు ఉంటారు వ‌ర్మ‌.

తాజాగా ఒక వెబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ సంచ‌ల‌న అంశాల్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవికి సంబంధించిన వ్యాఖ్య‌ల్ని చేశారు వ‌ర్మ‌. టాలీవుడ్ సత్తాను ప్ర‌పంచానికి చాటిన బాహుబ‌లిలో కీల‌క‌మైన శివ‌గామి క్యారెక్ట‌ర్ ను మొద‌ట శ్రీ‌దేవిని అనుకోవ‌టం.. త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌కు ఆ అవ‌కాశం ద‌క్క‌టం తెలిసిందే. ఈ విష‌యంలో ఆ మ‌ధ్య‌లో రాజ‌మౌళి సైతం కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌టం వివాదంగా మారింది.

భారీ డిమాండ్ల కార‌ణంగానే శివ‌గామి క్యారెక్ట‌ర్ ను శ్రీ‌దేవి చేయ‌లేద‌న్న విష‌యం మీద జ‌క్క‌న్న కూడా అప్ప‌ట్లో కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌టం.. ఆ త‌ర్వాత ఆ విష‌యం గురించి అన‌వ‌స‌రంగా స్పందించాన‌ని బాధ ప‌డ‌టం తెలిసిందే. తాజాగా వ‌ర్మ‌.. అదే విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు.

 శ్రీ‌దేవి బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌ను చేయ‌క‌పోవ‌టానికి కార‌ణం బోనీక‌పూరేన‌ని వ్యాఖ్యానించారు. తాను అప్ప‌ట్లో శ్రీ‌దేవితో మూడు..నాలుగుసార్లు మాట్లాడిన‌ట్లు చెప్పారు. బాహుబ‌లి మూవీలో శ్రీ‌దేవి సైతం న‌టించేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించార‌న్నారు. అయితే.. బోనీక‌పూర్ భారీ రెమ్యున‌రేష‌న్ కోరార‌న్నారు. ఆయ‌న అడిగిన రెమ్యున‌రేష‌నే.. శ్రీ‌దేవి బాహుబ‌లి సినిమా చేయ‌కుండా చేసిన‌ట్లుగా చెప్పారు.

బోనీ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌దేవి కెరీర్ ప‌రంగా ఎంతో న‌ష్ట‌పోయిన‌ట్లు చెప్పిన వ‌ర్మ‌.. బోనీతో పెళ్లి త‌ర్వాత ఒక్క రోజు కూడా ఆనందంగా లేరంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కాలం టాలీవుడ్ మీద ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తూ బోలెడ‌న్ని వివాదాల్లో చిక్కుకున్న వ‌ర్మ‌.. తాజాగా త‌న గురిని బాలీవుడ్ మీద పెట్ట‌టం.. ఏకంగా క‌పూర్ల ఫ్యామిలీ విష‌యాన్ని ట‌చ్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు