ఇది అల్లూ వారి అర్జున్ రెడ్డి సుమీ

ఇది అల్లూ వారి అర్జున్ రెడ్డి సుమీ

స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కొడుకు అయిన‌ప్ప‌టికీ మెగాస్టార్ మేన‌ల్లుడిగానే ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్‌. త‌న‌దైన స్టైలిష్ యాక్టింగ్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అది సాదాసీదాగా వ‌చ్చింది కాదు. ఈ స్థాయికి చేర‌డానికి... త‌న‌ని తాను నిరూపించుకోవ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు బ‌న్నీ. స్టార్ స్టేట‌స్ వ‌చ్చాక కూడా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాడు. అందుకు ఉదాహ‌ర‌ణే  ‘నా పేరు సూర్య’ మూవీ ట్రైల‌ర్‌.

కోపిస్టి మిల‌ట‌రీ ఆఫీస‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయాడు బ‌న్నీ. ఓ ర‌కంగా చెప్పాలంటే సూర్య ట్రైల‌ర్ చూసిన వాళ్ల‌కి గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా గుర్తుకు వ‌స్తుంది. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ వీరావేశాన్ని ఎంత న్యాచుర‌ల్ గా ప్ర‌ద‌ర్శించాడో... ‘నా పేరు సూర్య‌’ లో బ‌న్నీ అంత ప‌వ‌ర్ ఫుల్ గా పిచ్చి కోపం చూపించేశాడు. అర్జున్ రెడ్డి డాక్ట‌ర్ కాకుండా మిల‌ట‌రీలో చేరి ఉంటే ఎలా ఉండేద‌నే ఇంకో వెర్ష‌న్ కూడా అనుకోవ‌చ్చు. అర్జున్ రెడ్డిది ప్రేమ‌... సూర్య‌ది దేశ‌భ‌క్తి! అంతే తేడా. ఒక‌టిన్న‌ర నిమిషానికి కాస్త ఎక్కువ‌గా ఉన్న ట్రైల‌ర్ లోనే త‌నలోని కోపాన్ని ప్రేక్ష‌కుల మ‌దిలో ర‌గిలించేశాడు స్టైలిష్ స్టార్‌. ‘నా పేరు సూర్య‌’ ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రికీ అర్జున్ రెడ్డి లాంటి సినిమాను స్టార్ హీరో తీసి ఉంటే... ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేదో అర్థ‌మ‌వుతోంది.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫ‌స్ట్ ఇంపాక్ట్ తోనే అంచ‌నాల‌ను విప‌రీతంగా పెంచేసిన ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ... ట్రైల‌ర్ తో వాటిని మ‌రింత ఎత్తుకు ఎత్తుకు తీసుకెళ్లాడు. బ‌న్నీ అగ్రెసివ్ యాక్టింగ్ ఉప‌యోగించుకున్న‌తీరు అద్భుత‌హ‌! బ‌న్నీ త‌న అగ్రెసివ్ నెస్ తో మే 4న థియేట‌ర్ల నుంచి వ‌చ్చే ప్రేక్ష‌కుల మ‌దిలో ఎంత హ్యాపీనెస్ నింపుతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు