పాత‌వాళ్లు హిట్ట‌య్యారు... మ‌రి కొత్త‌వాళ్లు?

పాత‌వాళ్లు హిట్ట‌య్యారు... మ‌రి కొత్త‌వాళ్లు?

రామ్‌గోపాల్ వ‌ర్మ ఒక‌ప్పుడు కొండ శిఖ‌రం ఇప్పుడు అథఃపాతాళం. అస‌భ్య‌క‌ర సినిమాలు అన‌వ‌స‌ర వివాదాలు చీటికీ మాటికి మెగా ఫ్యామిలీని తిట్ట‌డం... ఇవ‌న్నీ రామ్ గోపాల్ వ‌ర్మ విలువ‌ను త‌గ్గించేశాయి. ఇప్పుడు అత‌డిని గౌర‌వించే వాళ్లు ఇండ‌స్ట్రీలో త‌క్కువే. మొన్న‌టికి మొన్న ఆయ‌న తీసిన జీఎస్టీ సినిమాతో అనేక మంది మ‌హిళ‌లు అత‌నికి విరోధులుగా మారారు. అలాంటప్పుడు ఆర్జీవీ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న అసిస్టెంట్ ద‌ర్శ‌కుల‌కు భ‌విష్య‌త్తు ఉంటుందా అనేదే కొత్త చ‌ర్చ‌. ఈ చ‌ర్చ‌కు ఆర్జీవీ పెట్టి ట్విట్ట‌ర్ పోస్టే కార‌ణ‌మైంది.

వ‌ర్మ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో శివ సినిమాకు త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్లతో క‌లిసి ఉన్న ఫోటోను పోస్టు చేశారు. అలాగే ప్ర‌స్తుతం నాగార్జున‌తో చేస్తున్న ఆఫీస‌ర్ సినిమాకు ప‌నిచేసిన అసిస్టెంట్లతో తీయించుకున్న గ్రూప్ ఫోటోను పోస్టు చేశారు. త‌న మొద‌టి సినిమాకు ప‌నిచేసిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు... ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న అసిస్టెంట్లు అని ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ పెట్టారు. పాత ఫోటోలో తేజ కృష్ణ వంశీ గుణ‌శేఖ‌ర్ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు వారంద‌రూ వ‌ర్మ‌ను మించిన టాప్ డైరెక్ట‌ర్లు అయ్యారు. మంచి మంచి సినిమాలు తీయ‌డంతో పాటూ మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ప్ర‌స్తుతం వ‌ర్మ ప‌రిస్థితే బాగోలేదు. చాలా ఏళ్లుగా ఒక్క హిట్ ఖాతాలో ప‌డ‌లేదు. పైగా కోరి తెచ్చుకున్న వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.  ఇక అత‌ని ద‌గ్గ‌ర ప‌నిచేసే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌కు మాత్రం ఏ అవ‌కాశాలు వ‌స్తాయి అని గుస‌గుస‌లాడే వాళ్లు పెరిగిపోతున్నారు.

వ‌ర్మ ద‌గ్గ‌ర ప‌నిచేసే వాళ్ల‌కు అవ‌కాశం రావాలంటే ముందు అత‌ని సిఫార‌సును ప‌ట్టించుకునే న‌టులు ఉండాలి క‌దా ఇండ‌స్ట్రీలో.  టాలీవుడ్‌ను ఏలుతున్న మెగా ఫ్యామిలీ అయితే వ‌ర్మ అసిస్టెంట్ల‌కు ఎలాంటి ఛాన్సు ఇవ్వ‌దు. నంద‌మూరి కుటుంబంతో వ‌ర్మ‌కు పెద్ద‌గా స్నేహం లేదు. ఇస్తే గిస్తే నాగార్జున అత‌ని కొడుకులే ఇవ్వాలి. పాపం వ‌ర్మ పిచ్చిత‌నం నోటి దురుసు అత‌ని ద‌గ్గ‌ర పనిచేసే అసిస్టెంట్ల‌కు శాపంగా మారుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు