రంగ‌మ్మ‌త్త‌!! రష్మీ ఫీల‌య్యిందమ్మా

రంగ‌మ్మ‌త్త‌!! రష్మీ ఫీల‌య్యిందమ్మా

పాపం ర‌ష్మీ... రంగ‌మ్మ‌త్త చేసిన ఓ ప‌నికి తెగ ఫీల‌య్యిపోతోంది. ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ ఏదో జ‌బ‌ర్ద‌స్త్‌ గొడ‌వ జ‌రిగింద‌నుకోకండి. ఈసారి ర‌ష్మీ ఫీల‌వ్వ‌డానికి కార‌ణం అన‌సూయ చేసిన ఓ పోస్టు. నిన్న ర‌ష్మీ పుట్టిన‌రోజు. ఇద్ద‌రు దోస్తులు క‌లిసి పార్టీ చేసుకున్నారు. బీచ్ కి వెళ్లి స‌ర‌దాగా ఎంజాయ్ కూడా చేశారు. అయితే రంగ‌మ్మ‌త్త చేసిన పోస్టుల్లో మాత్రం ర‌ష్మీ లేదు.

అన‌సూయ త‌న భ‌ర్త‌- పిల్ల‌ల‌తో క‌లిసి బీచ్ లో సాయంకాలం ఎంజాయ్ చేస్తున్న ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే అక్క‌డే ఉన్న ర‌ష్మీ మాత్రం ఈ ఫోటోల్లో లేదు. దాంతో తెగ ఫీల‌య్యిన ర‌ష్మీ గౌత‌మ్‌... ‘హాలో మేడ‌మ్ గారు... మ‌రి నావి ఏవి? నేను ఉన్న‌ఫోటోల‌ని కూడా పోస్ట్ చేయండి’ అంటూ ఓ స‌ర‌దా పోస్ట్ చేసింది. బ్లూ క‌ల‌ర్ టీ ష‌ర్టు... బ్లాక్ క‌ల‌ర్ షార్ట్ వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్న త‌న‌ ఫోటోల‌ను పెట్టింది ర‌ష్మీ. వింత వింత ఫోజులు పెడుతూ బాగానే ఎంజాయ్ చేసిందీ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌. ఆమె వెన‌కాలే స‌ముద్రాన్ని తీక్ష‌ణంగా చూస్తూ నిల్చుంది అన‌సూయ‌. అన‌సూయ‌- ర‌ష్మీ ఈ ఇద్ద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్లకి ఒక‌ప్పుడు ఒక‌రంటే ఒక‌రికి ప‌డేది కాదు.


అయితే కొన్నాళ్ల త‌ర్వాత అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ ను వెతుక్కుంటూ వెన‌క్కొచ్చింది. ఇద్ద‌రూ ఒక్కో రోజుని పంచుకుని గ్లామ‌ర్ విందు వ‌డ్డిస్తున్నారు. మంచి దోస్తులూ అయిపోయారు. అన‌సూయ ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా అల‌రిస్తే... మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం తెగ ప్ర‌య‌త్నిస్తోంది ర‌ష్మీ. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English