ఫాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన చిరంజీవి

ఫాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవిని చూసేందుకు దాదాపు వంద డాలర్లు ఖర్చు చేసి వెళ్లిన డల్లాస్‌ అభిమానులకి తీవ్ర నిరాశ ఎదురైంది. చిరంజీవిని చూసేందుకు వందల సంఖ్యలో వెళ్లిన వారిలో చాలా మందికి చిరుని కనీసం దూరం నుంచి కూడా చూసే వీలు చిక్కలేదు. ఒక ఇరవై, ముప్పయ్‌ మంది అదృష్టవంతులు మాత్రమే చిరంజీవికి దగ్గరగా వెళ్లగలిగారు. కొందరైతే ఫోటోలు దిగారు.

నిర్వహణ లోపమో, లేక జనాన్ని అదుపు చేయలేదనే కోపమో కానీ చిరంజీవి సడన్‌గా అక్కడ్నుంచి వాకౌట్‌ చేసారు. నిర్వాహకులు ఒక్కసారి స్టేజీ మీదకి రావాలని ఎంతగా రిక్వెస్ట్‌ చేస్తున్నా కూడా చిరంజీవి స్టేజ్‌ మీదకి వెళ్లలేదు. అభిమానులని హర్ట్‌ చేయడానికి చిరంజీవి అసలు ఇష్టపడరు. కాస్త కష్టమైనా, ఇబ్బందులున్నా కూడా ఫాన్స్‌ కోసం ఆయన వాటిని భరిస్తుంటారు. మరి అంత దూరం వెళ్లి, తన కోసం అంత ఖర్చు పెట్టుకుని వచ్చిన వారిని కలవకుండా వెళ్లిపోవడానికి అసలు కారణాలేమిటో కానీ అక్కడికి వెళ్లిన వారు మాత్రం చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల అల్లు అర్జున్‌ యుఎస్‌ వెళ్లినపుడు కూడా సిమిలర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎదురైంది. హోటల్‌ రూమ్‌లో లాక్‌ చేసుకుని అసలు బయటకి వచ్చేందుకే అల్లు అర్జున్‌ నిరాకరించడంతో నిర్వాహకులు అతడిని బతిమిలాడుతూ డోర్‌ దగ్గరే పడిగాపులు పడాల్సి వచ్చింది. సెలబ్రిటీలని అమెరికాకి ఆహ్వానిస్తోన్న వారు వారికి తగిన విశ్రాంతినిచ్చి ఇలాంటి ఈవెంట్లని లోపాలు లేకుండా ప్లాన్‌ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే అభిమానుల దృష్టిలో హీరోలు బ్యాడ్‌ అయిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English