ప‌వ‌న్ పై శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

ప‌వ‌న్ పై శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని న‌టి శ్రీ‌రెడ్డి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆమెపై ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ చేశారు. దానికి త‌గ్గ‌ట్లుగానే శ్రీ‌రెడ్డి కూడా ప‌వ‌న్, మెగా ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెట్టింది.

అయితే, నానాటికీ ప‌వ‌న్ ఫ్యాన్స్ తో పాటు నెటిజ‌న్లు కూడా శ్రీ‌రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్ట‌డంతో శ్రీ‌రెడ్డి తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఇక‌పై తాను చేసే పోస్ట్ లకు, పీకేకు ఎటువంటి సంబంధం ఉండ‌ద‌ని శ్రీ‌రెడ్డి పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాలని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నానని శ్రీరెడ్డి  తెలిపింది.

ఫేస్ బుక్ లో కొంత‌కాలంగా వాడీవేడీ పోస్టులు పెడుతోన్న శ్రీ‌రెడ్డి స‌డెన్ గా సైలెంట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఓ కొటేష‌న్ ను పోస్ట్ చేసిన శ్రీ‌రెడ్డిపై ట్రోలింగ్ జ‌రిగింది. దీంతో, ఆమె ఆ పోస్ట్ కు వివ‌ర‌ణ ఇచ్చింది. తాను రూ.5 కోట్లు తీసుకున్నాన‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే ఓ కొటేష‌న్ పెట్టాన‌ని, అది ఎవ‌రినీ ఉద్దేశించి కాద‌ని శ్రీ‌రెడ్డి తెలిపింది.

‘చివరిసారిగా అందరికీ ఒక విషయం చెబుతున్నాను.. అంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను.. పీకే గురించి ప్రస్తావించడం ఆపేశాను. నేను చేసే ప్రతి పోస్ట్ ను అనవసరంగా పీకేకు ఆపాదించవద్దు..ఇక‌పై నేను చేసే పోస్టుల‌కు...పీకేకు ఎటువంటి సంబంధం లేదు’ అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అంత‌కుముందు శ్రీ‌రెడ్డి మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. ``మంచిగా జీవిస్తే చాలు...వెధ‌వ‌ల ద‌గ్గ‌ర నిరూపించుకోవాల్సిన‌ అవ‌స‌రం లేదు``...అంటూ పెట్టిన పోస్టుకు వివ‌ర‌ణ ఇచ్చింది. ‘‘5 కోట్ల రూపాయల అంశం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ పోస్ట్ చేశాను’ అని శ్రీ‌రెడ్డి చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు