ఆ హీరోయిన్ కెరీర్ క్లోజన్నమాటే..

ఆ హీరోయిన్ కెరీర్ క్లోజన్నమాటే..

తొలి సినిమాలోనే ధనుష్ లాంటి స్టార్ హీరోతో.. గౌతమ్ మీనన్ లాంటి టాప్ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం దక్కించుకుంది తమిళ అమ్మాయి మేఘా ఆకాష్. కానీ ఆమె తొలి సినిమా ‘ఎన్నై నోకి పాయుం తోట’ విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. అయినప్పటికీ తెలుగులోనూ నితిన్ లాంటి క్రేజ్ ఉన్న యంగ్ హీరో సరసన ‘లై’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్సొచ్చింది. కానీ ఆ చిత్రం దారుణ ఫలితాన్నందుకుంది. అయినా నితిన్‌తో మళ్లీ ‘చల్ మోహన్ రంగ’లో జత కట్టే అవకాశం దక్కంది. త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పేర్లు ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉండటంతో ఇది మంచి ఫలితాన్నందుకుంటుందని.. తెలుగులో తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశించింది మేఘా. కానీ అలాంటిదేమీ జరగలేదు.

‘చల్ మోహన్ రంగ’ నితిన్ కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వేరే సమయాల్లో అయితే ఏదోలా ఆడేసేదేమో కానీ.. ‘రంగస్థలం’ ప్రభంజనం సాగుతున్న సమయంలో రిలీజ్ కావడం ప్రతికూలమైంది. ‘లై’ కంటే కూడా దీనికి తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం విడుదలకు ముందు మేఘాను వేరే రెండు సినిమాలకు కన్సిడర్ చేస్తున్నారని.. ఆమెను నితిన్ రెఫర్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. కానీ వరుసగా రెండో డిజాస్టర్ ఖాతాలో వేసుకునేసరికి మేఘాను కథానాయికగా పెట్టుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. మరోవైపు ధనుష్-గౌతమ్ సినిమా ఇప్పుడిప్పుడే బయటికి వచ్చేలా లేదు. ఆ సినిమాపై ఆసక్తి మొత్తం పోయింది. అది విడుదలైనా మంచి ఫలితాన్నందుకుంటుందన్న అంచనాలేమీ లేవు. మొత్తానికి మేఘాకు ఆరంభంలో వచ్చిన అవకాశాలు చూస్తే ఆమె ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నారు. కానీ ఆమె కెరీర్ మూడు సినిమాల ముచ్చట అయ్యేట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు